హెయిర్‌లాస్‌ దీనికి సంకేతం కావచ్చు!

17-01-2018: సాధారణంగా మహిళల్లో కనిపించే హెయిర్‌లాస్‌(జుత్తు ఊడడం) కారణంగా గర్భాశయం(యూట్రస్‌)లో గడ్డలు ఏర్పడే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. సుమారు నాలుగు లక్షల మంది మీద వీరు అధ్యయనం నిర్వహించారు. వీరికి హెయిర్‌లాస్‌ సమస్య చాలా ఎక్కువగా ఉందని అధ్యయనకారులు చెబుతున్నారు. కొన్ని రోజుల అనంతరం వీరి ఆరోగ్యాన్ని పరిశీలించగా వీరిలో పదహారు వేల మంది స్త్రీల గర్భాశయాలలో కాన్సర్ రహిత కణుతులను వీరు గుర్తించారు. మామూలుగా అధికరక్తస్రావం ఉన్న సమయంలోనే గర్భాశయంలో కణుతులు ఉన్నట్టు అనుమానిస్తారు. కానీ తరచూ అదే పనిగా జుత్తు ఊడిపోతున్నా, ఊడిన జుత్తు స్థానంలో కొత్త జుత్తు రాకపోయినా అనుమానించాల్సిందేనని వారు అంటున్నారు. అయితే జుత్తు ఊడడానికి గర్భాశయంలో కణుతులకి ఉన్న సంబంధం గురించి ఇంకా అధ్యయనాలు నిర్వహించాలని వారు చెబుతున్నారు.