నీరు ఎక్కువ తాగాల్సిందే!

09-08-2018: రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు తాగితే సరిపోతుందన్న భావన తప్పు అంటున్నాయి నూతన పరిశోధనలు. రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు కూడా శరీరానికి సరిపోదనీ, మనం ఎన్ని గంటలు మెలకువగా ఉంటే అని గ్లాసుల నీరు తాగాలని, అప్పుడే శరీరం డిహైడ్రేట్‌ కాకుండా ఉంటుందన్న విషయం ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది. మామూలుగా రోజులో  14 నుండి 16 గంటలు మెలకువగా ఉంటారు కనుక అన్ని గ్లాసుల నీరు తాగాల్సిందే అంటున్నారు పరిశోధకులు.  బాడీమాస్‌ ఇండెక్స్‌ను అనుసరించి కూడా నీటిని తాగవలసి ఉంటుందని అధ్యయనకారులు చెబుతున్నారు. మామూలుగా ఆరు నుంచి ఎనిమిదిగ్లాసుల నీటిని నేరుగానూ, మరో రెండు గ్లాసులు ఆహారపదార్థాలద్వారానూ తీసుకుంటారనీ, అలాకాకుండా కనీసం పదిగ్లాసుల నీటిని నేరుగా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.