ఫ్రిజ్‌నీరు తాగకూడదా?

18-04-2018: మండువేసవిలో భోజనంకన్నా చల్లనినీరే ప్రియమైందిగా కనిపిస్తుంది. మామూలు సమయాలలో కూల్‌వాటర్‌ తాగినా ఫరవాలేదుకానీ, భోజనం చేసిన వెంటనే ఫ్రిజ్‌వాటర్‌ తాగకూడదు అంటున్నారు నిపుణులు. భోజనంచేసిన వెంటనే చల్లనినీరు తాగడం వలన గుండెజబ్బులు, కాన్సర్‌ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. భోజనానికి అరగంట ముందు లేదా అరగంట తరువాత మాత్రమే చల్లనినీరు తాగాలని వారు సూచిస్తున్నారు. భోజనం చేస్తున్న సమయంలో గోరువెచ్చని నీరు తాగితే జీర్ణక్రియ సక్రమంగా సాగడంతో పాటు శరీరంలో చెడుకొలస్ట్రాల్‌ దరిచేరదని వారు సూచిస్తున్నారు.