పిల్లలతో ఆయుష్షు తగ్గుతుందా?

18-04-2018: నిజమే అంటున్నాయి తాజాపరిశోధనలు. పిల్లలు లేని తల్లితో పోల్చుకుంటే పిల్లలున్న తల్లి ఆయుష్షు పదకొండు సంవత్సరాలు తగ్గుతుందట! జార్జ్‌ మానసన్‌ యూనివర్శిటీ వారు చేసిన అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. మానవ క్రోమోజోముల్లో ఉంటే టెలోమేర్స్‌ పిల్లలున్న మహిళల్లో తక్కువగా ఉండడాన్ని వీరు గమనించారు. ఈ టెలోమేర్స్‌ జీవన కాలాన్ని పెంచుతాయనీ, ఇవి తక్కువగా ఉండడం వలనే వీరి జీవనకాలం తక్కువ కావచ్చని అధ్యయనకారులు అభిప్రాయపడుతున్నారు. పిల్లలు పుట్టిన తరువాత స్త్రీలో టెలోమేర్స్‌ పొడవు తగ్గుతుందా? అన్న విషయాన్ని మాత్రంవీరు నిర్ధారించలేకపోతున్నారు. ప్రాధమిక అధ్యయనంలో ఈ విషయం తేలిందనీ, దీని మీద ఇంకా పరిశోధనలు నిర్వహించాల్సి ఉందని వారు అంటున్నారు.