సోషల్‌ మీడియాతో వృద్ధుల డిప్రెషన్‌ మాయం!

07-11-2018: డిప్రెషన్‌లో ఉండే వృద్ధులు మందులు వాడడం కన్నా సోషల్‌ మీడియా ఫాలో అయితే మంచి ఫలితం పొందుతారని అంటున్నారు మిచిగాన్‌ యూనివర్సిటీ అధ్యయనకారులు. సోషల్‌ మీడియా ఉపయోగించడం వలన డిప్రెషన్‌ వలన కలిగే బాధ 20 శాతం వరకూ తగ్గుతుందని వీరి అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఎక్కువ సేపు సోషల్‌ మీడియాలో గడపడం కూడా అంతమంచిది కాదని వారు హెచ్చరిస్తున్నారు. బిల్లుల చెల్లింపు, ఇంటి సరుకులు కొనుగొలు వంటివి స్వయంగా చేసుకుంటేనే మంచిదని వారు సూచిస్తున్నారు. ఈ పనులతోపాటు రోజులో కనీసం ఓ గంట సేపు సోషల్ మీడియాలో గడిపితే వారిలో ఒంటరితనం, డిప్రెషన్‌ తగ్గుముఖం పడతాయని వారు స్పష్టం చేస్తున్నారు.