హైఫైబర్‌ ఫుడ్‌తో కోలన్‌ కేన్సర్‌ దూరం!‍

16-11-2017: ఫైబర్‌ అధికంగా ఉండే పదార్థాలను రోజూవారి ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా పెద్దపేగు కేన్సర్‌ దూరం చేసుకోవచ్చని బోస్టన్‌లోని మసాచుసెట్స్‌ జనరల్‌ హాస్పెటల్‌ వైద్యులు చెబుతున్నారు. వీరి అధ్యయనంలో భాగంగా 1,575 మంది పెద్దపేగు కేన్సర్‌తో బాధపడుతున్న వారిపై గత ఎనిమిది సంవత్సరాలుగా పరిశోధన నిర్వహించారు. అందులో ఫైబర్‌ను ఆహారంలో అధికంగా తీసుకున్నవారు ఎక్కువ కాలం జీవించి ఉంటే, ఆహారంలో భాగం చేసుకోని 773మంది చనిపోయారట. ఆహారంలో ఫైబర్‌ అధికంగా ఉండేలా చూసుకోవడం ద్వారా 22శాతం కోలన్‌ కేన్సర్‌ను దూరం చేసుకోవచ్చని వీరి పరిశోధనల్లో తేలింది.