మొటిమల్ని తగ్గించే కాఫీ!

07-11-2018: ఈ వార్త టీనేజీ అమ్మాయిలకు ఎనలేని ఆనందాన్ని కలిగిస్తుంది. టీనేజీ అమ్మాయిలలో నూటికి తొంభైశాతం మంది మొటిమలతో బాధపడుతుంటారు. వీటిని పోగొట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలూ, క్రీములు ఉపయోగిస్తుంటారు. ఇక నుంచీ టీనేజీ అమ్మాయిలు అలాంటి తిప్పలు పడనవసరంలేదని అధ్యయనకారులంటున్నారు. రోజుకు నాలుగు కప్పుల కాఫీ తగ్గితే మొటిమల బారినుంచి కొంత వరకూ తప్పించుకోవచ్చన్న విషయం వీరి అధ్యయనంలో వెల్లడైంది. కాఫీ తాగడం వలన పలు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చన్న విషయం తెలిసిందే! ఇప్పుడు ముఖ సౌందర్య పరిరక్షణలో కూడా కాఫీ ఉపయోగపడుతుందన్న సంగతి వెల్లడైంది. కాఫీలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలే మొటిమలను తగ్గించడానికి దోహదపడతాయని వారు అంటున్నారు. అయితే ఈ విషయం మీద ఇంకా విస్తృతంగా అధ్యయనం చేయాలని వారు చెబుతున్నారు.