కేన్సర్‌ను అడ్డుకునే చెరుకురసం

16-05-2018: వయస్సుతో సంబంధంలేకుండా అందరూ ఇష్టపడే చెరకురసంలో కేన్సర్‌ కణాలను అడ్డుకునే శక్తి ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా రొమ్ముకేన్సర్‌ను అడ్డుకునే ఫ్లేవనాయిడ్స్‌ ఇందులో పుష్కలంగా ఉన్నాయన్న విషయం ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. అయితే చెరకురసం కేన్సర్‌ కణాలను అడ్డుకుంటుందేతప్ప మందుగా ఉపయోగపడదని వారు చెబుతున్నారు. బరువు పెరగాలనుకునేవారికి చెరకురసం చాలాబాగా ఉపయోగపడుతుంది. శరీరంలోని వ్యర్ధాలను తొలగించడానికి ఇదిబాగా పనిచేస్తుంది. చెరకురసానికి కొద్దిగా ఉప్పు, నిమ్మకాయరసం జతచేసి తీసుకుంటే గొంతునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందట!