రణగొణ ధ్వనులతో రక్తపోటు!

07-11-2018: శబ్దకాలుష్యం పలు రకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందన్న సంగతి తెలిసిందే! ఇప్పుడు దీని కారణంగా రక్తపోటు పెరిగే అవకాశాలున్నాయంటున్నారు  పరిశోధకులు. అధికరక్తపోటు వల్ల గుండె  సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. ప్రతి ఐదుగురిలో ఒకరు శబ్దకాలుష్యం కారణంగా అనారోగ్యం బారిన పడుతున్నారని విషయవ వీరి అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల మీద శబ్దకాలుష్య ప్రభావం ఎక్కువగా ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు. ఇది పిల్లల ఆరోగ్యం మీద దీర్ఘకాలంలో తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పది సంవత్సరాల లోపు పిల్లలను భారీ శబ్దాలకు దూరంగా ఉంచాలని వారు సూచిస్తున్నారు.