కీళ్లనొప్పులకు సులువైన వైద్యం

ఆంధ్రజ్యోతి,18-04-2017: శొంఠి, పిప్పళ్లు, మిరియాలు ఈ మూడింటి చూర్ణాన్ని ‘త్రికటు చూర్ణం’ అంటారు. ఒక చెంచా పరిమాణంలో ఈ చూర్ణాం తీసుకుని, కొంచెం ఉప్పు కలిపేసుకుని, రోజూ పెరుగుతో కలిపి తింటూ ఉంటే మోకాళ్లనొప్పులు, నడుంనొప్పి తగ్గుతాయి.

పిప్పళ్లు, మోడి, శొంఠి మూడు సమ భాగాలుగా తీసుకుని, విడివిడిగా వేయించాలి. ఆ తర్వాత మెత్తగా దంచి చూర్ణం చేయాలి. 50 గ్రాముల చూర్ణానికి 400 గ్రాముల పెరుగు, 400 గ్రాముల నువ్వుల నూనె కలపాలి. పెరుగు తడి అంతా ఆరిపోయి, నూనెమాత్రమే మిగిలే దాకా పొయ్యి మీద మరిగించాలి. ఆ తర్వాత దించి చల్లార్చాలి. ఈ నూనె వడగట్టి, భద్రపరుచుకుని నొప్పులు ఉన్న చోట మర్ధన చేసి, ఉప్పు కాపడం పెడితే కీ ళ్లనొప్పులు తగ్గుతాయి. కాళ్లకు మంచి పటుత్వం వస్తుంది. 
కరక్కాయల్లోని గింజలు తీసివేసి, మెత్తగా దంచి, 100 గ్రాముల పొడికి 60 గ్రాముల మెత్తని సైందవ లవణాన్ని కలిపి, మజ్జిగతో తీసుకుంటే, వాతం నొప్పులు, మలబద్దకం తగ్గుతాయి.
ఒక గ్లాసు చిక్కటి గంజిలో ఒక చెంచా శొంఠిపొడి కలిపి కొంచెం ఉప్పు వేసుకుని తాగుతూ ఉంటే, చాలా త్వరితంగా కీళ్లనొప్పులు తగ్గుతాయి.