కీళ్ళ నొప్పులకు విటమిన్‌ డి

08-12-2017: శరీరంలో తగినంత విటమిన్‌ డి ఉన్నట్టయితే కీళ్ళనొప్పుల నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు బర్మింగ్‌హోమ్‌ యూనివర్శిటీ పరిశోధకులు. ఒకసారి కీళ్ళనొప్పుల బారినపడిన వారికి విటమిన్‌–డి సాధారణ మోతాదులో ఎలాంటి ప్రయోజనం ఉండదనీ, ఎక్కువ మోతాదులో విటమిన్‌–డి ఇవ్వడం వలన కీళ్ళనొప్పులను పూర్తిగా నయం కాకపోయినా వీటి తీవ్రతను చాలా వరకూ వాటి తీవ్రత తగ్గించడానికి మాత్రమే ఈ విటమిన్‌ ఉపయోగపడుతుందనీ వారు స్పష్టం చేస్తున్నారు. శరీరంలో విటమిన్‌–డి తక్కువ అయినప్పుడే కీళ్ళనొప్పులు, వాపులు కనిపిస్తాయనీ, వీటినుంచి తప్పించుకోవాలంటే విటమిన్‌–డి తీసుకోవడం తప్పనిసరి అని వారు చెబుతున్నారు. నలభై సంవత్సరాలు పైబడిన వారి శరీరంలో విటమిన్‌–డి స్థాయి క్రమేపీ తగ్గే అవకాశం ఉందనీ, అలాంటి వారు వైద్యుల సలహా మేరకు విటమిన్‌–డి తీసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చని వీరు సూచిస్తున్నారు.