కీళ్ల నుంచి శబ్దం.. ఆస్టియో ఆర్థరైటిస్‌కు సూచన !

హ్యూస్టన్‌, మే 4: కీళ్లను కదిలించినపుడు, వంచినపుడు శబ్దాలు వినబడుతుంటే.. ఆస్టియోఆర్థరైటిస్‌ బారిన పడే ప్రమాదం ఎక్కువని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఆస్టియోఆర్థరైటిస్‌ అంటే.. ఎముకల చివర్లలో ఉండే సున్నితమైన, ఫ్లెక్సిబుల్‌ కణజాలం అరిగిపోవడమని బేలర్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈమేరకు 3500 మంది వలంటీర్ల ఆరోగ్య నివేదికలను పరిశీలించి ఈ విషయాన్ని కనుగొన్నట్లు వివరించారు. కాగా, ఏడాది వ్యవధిలో ఆస్టియోఆర్థరైటిస్‌ బారినపడ్డ వలంటీర్లలో 75 శాతం మందికి ముందుగా ఈ చిహ్నాలు కనిపించాయని అన్నారు. రేడియోగ్రాఫిక్‌ చిత్రాలలో దీనిని గమనించవచ్చన్నారు. అయితే, అధ్యయనం ప్రారంభించిన తొలినాళ్లలో ఎప్పుడో ఒకసారి తప్ప కీళ్ల నొప్పులు ఇబ్బంది పెట్టలేదని వివరించారు. ఈ క్రమంలో కీళ్లను మడిచినపుడు ఏవైనా శబ్దాలు వినబడుతుంటే అది ఆస్టియో ఆర్థరైటి్‌సకు సూచనగా భావించాలన్నారు.