ఓ మై గ్యాడ్జెట్స్

ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లంటే ఉన్న ఇష్టం మిమ్మల్ని రకరకాల నొప్పులకు గురిచేస్తోందా? ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అవడం వల్ల కూడా ఈ నొప్పులతో బాధపడుతున్నారా? వేళ్లు, చేతులు, మెడ, మోచేయి, కళ్ల బాగా నొప్పి పెడుతున్నాయా? ఇతరత్రా గాయాల బారిన కూడా పడుతున్నారా? ఒక నివేదిక ప్రకారం 75 శాతం మంది యువత ఇలాంటి తీవ్ర నొప్పులతో బాధపడుతున్నారని తేలింది. అంతేకాదు 60 శాతం మంది క్రానిక్‌ పెయిన్‌తో ఇబ్బందిపడుతున్నారు. వీటిని తగ్గించుకోవడానికి టిప్స్‌ కొన్ని ఉన్నాయి. అవి:

అతిగా స్మార్ట్‌ఫోన్స్‌, టాబ్లెట్స్‌, గేమింగ్‌, డిజిటల్‌ డివైజులు వాడ డం వల్ల ఈ తరహా నొప్పులు తలెత్తుతాయి. అందుకే వీటి వినియోగాన్ని తగ్గించాలి.

గ్యాడ్జెట్లను వాడేటప్పుడు కింద పెట్టుకుని వాడొద్దు. కంటి చూపుకు సమస్థాయిలో గ్యాడ్జెట్‌ను పెట్టుకుని వాడితే మెడనొప్పి, వెన్నునొప్పి తలెత్తవు.

 ప్రతి 20 సెకన్లకు ఒకసారి గ్యాడ్జెట్‌ స్ర్కీన్‌ నుంచి దృష్టి మరలిస్తే కన్ను డిజిటల్‌ స్ట్రెయిన్‌కు గురికాదు.

గ్యాడ్జెట్‌ను కంటికి దగ్గరగా పెట్టుకుంటే మంచిది కాదు. తగినంత దూరంలో పెట్టుకుని గ్యాడ్జెట్లను ఉపయోగిస్తే కళ్లు అలసిపోవు.

వర్కవుట్లు చేసేటప్పుడు గాయాలు కాకుండా కండరాలను వార్మప్‌ చేయాలి. అలాగే స్ట్రెచెస్‌ కూడా తప్పనిసరిగా చేయాలి. ఇలా చేయడంవల్ల శరీరానికి గాయాలు కావు. నొప్పులు తలెత్తవు.

వ్యాయామం అనంతరం గాయమైనా లేదా ఆడేటప్పుడు గాయమైనా వెంటనే నొప్పి తీవ్రతను గుర్తించేందుకు పెయిన్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలిస్టును సంప్రదించాలి.

 ఆఫీసులో లేదా లైబ్రరీలో గంటల తరబడి కూర్చోకుండా గంటకొకసారి కాసేపు అటు ఇటు తిరగాలి. ఎందుకంటే ఒకేచోట కదలకుండా కూర్చున్నా కూడా ఒళ్లు నొప్పులు వస్తాయి. నిత్యం వ్యాయామాలు చేయకపోయినా ఈ సమస్య తలెత్తుతుంది. ముఖ్యంగా వెన్నునొప్పి బాధిస్తుంది. రోజూ అరగం ట వాకింగ్‌ తప్పనసరిగా చేయాలి. 

 ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే నొప్పులు క్రానిక్‌ కావు.

 నిత్యం తక్కువ ప్రభావాన్ని చూపే ఏరోబిక్‌, స్ట్రెంగ్త్‌ వ్యాయామాలు చేయాలి.

 ఆరోగ్యకరమైన శరీర బరువు కలిగి ఉండాలి. సమతులమైన పౌషికాహారాన్ని తీసుకోవాలి.