కీళ్ల వాతానికి దూసరి తీగ

26-02-2018: ఆకులను దంచి రసం తీసి, అందులో చక్కెర కలిపి అరగంట ఉంచితే, గడ్డగా మారుతుంది. దీన్ని ప్రతి రోజూ ఒక స్పూను చొప్పున 15 రోజుల పాటు తింటే, తెల్లబట్ట త గ్గడంతో పాటు బహిష్టు సమయంలో వచ్చే కడుపు నొప్పి నివారణ అవుతుంది. ఇది శరీరానికి చలువ చేస్తుంది కూడా.

దూసరి తీగె చెట్టు ఆకుల రసంలో చక్కెర కలిపి కొద్ది రోజుల పాటు సేవిస్తే, మూత్ర బంధ సమస్యలు, చురుకు, పోటు, మంట తగ్గి మూత్ర విసర్జన సాఫీగా సాగుతుంది. పైగా ఈ వైద్యం వల్ల వీర్యపుష్టి కలుగుతుంది.
ఈ చెట్టు వేళ్ల కషాయానికి సమానంగా ఆవు పాలు కలిపి సేవిస్తే మధుమేహం అదుపులో ఉంటుంది.
వేళ్ల కషాయంలో 20 మిరియాల పొడి కలిపి, అందులో 200 మి. లీ. మేక పాలు కలిపి ప్రతి ఉదయం పరగడుపున తాగుతూ ఉంటే కీళ్ల వాతం హరిస్తుంది.
దీని దుంపను మెత్తగా దంచి తగు మాత్రం పటిక బెల్లం కలిపి సేవిస్తే గనేరియా తగ్గిపోతుంది.