ముస్లిం ప్రార్థన విధానంతో వెన్నునొప్పి మాయం

 

న్యూయార్క్‌, 08-03-2017:ముస్లింల ప్రార్థనా విధానంతో వెన్ను నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని తాజా పరిశోధనలో వెల్లడైంది. వెన్ను నొప్పితో బాధపడే వారు యోగా చేయడం మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. ఫిజియో థెరపీని ఆశ్రయించాలనికూడా చెబుతుంటారు. అయితే, సంప్రదాయ పద్ధతిలో నమాజ్‌ చేసే వారి కదలికలు యోగాభ్యాసాలను, ఫిజికల్‌ థెరపీని పోలి ఉంటాయని బింగ్‌హామ్టన్‌ వర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఇలా క్రమం తప్పకుండా రోజూచేస్తే వెన్ను నొప్పికి గుడ్‌బై చెప్పొచ్చని పేర్కొన్నారు.