కీళ్ల నొప్పులకు హోమియో చికిత్స

17-01-2018: ఆధునిక జీవన విధానం కీళ్లపై మరింత ఒత్తిడి పెంచుతోంది. ఎక్కువ సమయం కూర్చోవడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, బరువు పెరగడం వంటి కాణాలు కీళ్ల జబ్బులకు పరోక్షంగా దోహదం చేస్తున్నాయి. వంశపారంపర్య కారణాల వల్ల కూడా ఈ సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. శరీర రక్షణ వ్యవస్థకు సంబంధించిన లోపాలు కూడా కీళ్ల నొప్పులు పెంచుతాయి. వీటన్నింటికీ తోడు కొన్ని రకాల వ్యాధులు, ప్రమాదాల్లో గాయపడడం వల్ల కీళ్లు దెబ్బతిని, చాలా సందర్భాల్లో అంగవైకల్యానికి కూడా దారి తీస్తాయి. కీళ్లను అవసరానికి మించి ఉపయోగించడం వల్ల కీళ్లు బలహీనమై సమస్యలకు లోనయ్యే అవకాశం ఉంది.

నడవడమే కష్టం
కీళ్ల సమస్యలు ఉన్నప్పుడు మోకాళ్లు లేదా ఇతర కీళ్ల భాగంలో విపరీతమైన నొప్పి, వాపు, బిగుతుగా ఉండటం, నడవడానికి ఇబ్బంది వంటివి వస్తాయి. మెల్లమెల్లగా కీళ్లు దాని రూపాన్ని కోల్పోవడంతో కాలు నిర్మాణంలో కూడా తేడా కనిపిస్తుంది. సకాలంలో దీనికి చికిత్స తీసుకోకపోతే అంగవైకల్యం కలిగే అవకాశం ఉంది. కీళ్లలో అరుగుదల, నష్టం ఎక్కువైన తరువాత కీళ్ల కదలిక తగ్గుతుంది. కండరాల పటుత్వంలో అసనమానతలు ప్రారంభమవుతాయి. కొన్ని రకాల పనులు చేయలేము. కూర్చొని లేచినప్పుడు, మెట్లు ఎక్కడం, దిగడం వంటివి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సంప్రదాయ టాయిలెట్స్‌ ఉపయోగించడం కూడా సమస్యగా మారుతుంది.
 
వాపు... కీళ్లలో జరిగే మార్పులు
కీళ్లు అతుక్కునే భాగాన్ని ఆర్టిక్యులర్‌ కార్టిలేజ్‌ అంటారు. కీళ్ల సమస్య ఉన్నప్పుడు ముందుగా ఈ ఆర్టిక్యులర్‌ కార్టిలేజ్‌ నుంచే మార్పులు మొదలవుతాయి. ఏ కారణం వల్ల కీళ్లు ప్రభావితం అయినా ఈ కార్టిలేజ్‌ పలుచబడి, సాగి, ముడతలు పడుతుంది. కీళ్ల భాగంగా పొలుసుల మాదిరిగా ఏర్పడతాయి. ఫలితంగా కీళ్ల కదలికలకు అంతరాయం ఏర్పడుతుంది. దీని పక్క భాగంలోని రక్తనాళాలు ఉబ్బడం ద్వారా కార్టిలేజ్‌కు ఎక్కువగా రక్త సరఫరా జరుగుతుంది.
 
ఈ మార్పుల వల్ల ఆస్టియోపైట్స్‌ ఏర్పడతాయి. సాధారణంగా ప్రతి 40 రోజులకు పాత ఎముక కణాలు చనిపోయి కొత్తవి పుడుతుంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్‌ సమస్య ఉన్నప్పుడు ఈ కారణాలు ఎముక అరిగిన దగ్గర కాకుండా వేరే చోట ఏర్పడతాయి. తద్వారా ఈ ఆస్టియోపైట్స్‌ కీళ్లను రాపిడికి గురిచేస్తాయి. దీనివల్ల కీళ్లు గట్టిపడడం, వాపు మొదలనవి కలుగుతాయి. కీళ్లు లోపలి ద్రవం సన్నటి రంధ్రాల ద్వారా ఎముకల మధ్యకు వెళ్లి గడ్డలుగా తయారవుతాయి. ఈ కారణంగా ఎముకలోని ట్రాబిక్యులే అనే భాగానికి నష్టం వాటిల్లుతుంది. క్రమంగా కీళ్లలోని జిగురు పదార్థం తగ్గడం వల్ల కీళ్లు గట్టిగా మారి కదలికలో ఇబ్బంది ఎక్కువవుతుంది.
 
ఆపరేషన్‌ లేకుండా హోమియో వైద్యం
కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి రక్త పరీక్షలు, ఎక్స్‌రే, ఎంఆర్‌రై స్కానింగ్‌ ద్వారా ఏఏ కారణాలతో దెబ్బతిన్నదన్నది? వ్యాధి ఏ రకమైనదనే విషయం నిర్థారణ చేయవచ్చు. చాలా సందర్భాల్లో కీళ్ల నొప్పులు ముఖ్యంగా ఆస్టియో అర్టరైటిస్‌ తగ్గాలంటే కీళ్ల మార్పిడి చికిత్స తప్ప గత్యంతరం లేదని భయపడుతుంటారు. కానీ ఆపరేషన్‌ లేకుండా జబ్బును తగ్గించగల మందులను అందుబాటులోకి తెచ్చింది అత్యాధునిక హోమియో వైద్యం. ఆధునిక హోమియో మందులు ఇన్‌ఫెక్షన్ల వంటి టాక్సిన్స్‌ని బయటకు పంపించి వాపును తగ్గిస్తాయి.
 
దెబ్బతిన్న భాగానికి రక్త సరఫరా సవ్యంగా జరిగేట్టు చేసి, గాయం త్వరగా మానడానికి సహకరిస్తాయి. కండరాలను బలోపేతం చేస్తాయి. నొప్పి, వాపు తగ్గించడంలో తోడ్పడతాయి. ఆస్టియో ఆర్థరైటిస్‌ తొలి దశలోనే చికిత్స ప్రారంభిస్తే దెబ్బతిన్న కార్టిలేజ్‌ను పునరుద్ధరించే అవకాశం హోమియో వైద్యంలో ఉంది. సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఆపరేషన్‌ తప్పనిసరి పరిస్థితి వస్తుంది.
 
 
డాక్టర్‌ మురళీ అంకిరెడ్డి, ఎం.డి. హోమియో
స్టార్‌ హోమియో, ఫోన్‌- 8977 336677,
టోల్‌ఫ్రీ :1800-108-5566
www.starhomeo.com
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, దుబాయ్‌, లండన్‌, మాంచెస్టర్‌