ఆర్థరైటిస్‌కు మేలైన చికిత్స

29-08-2017:శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో జీవక్రియల మార్పుల వలన, జన్యుపరమైన మార్పుల వలన వచ్చే కీళ్ల జబ్బుల్లో రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ ఒకటి. ప్రపంచ జనాభాలో 0.5 శాతం నుంచి 1 శాతం వరకు ఈ జబ్బుతో బాధపడుతున్నారు. 15 సంవల్సరాలలోపు వయసు గలవారిలో ఈ జబ్బు రావడం చాలా అరుదు. 20 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల మధ్య వయసు గల వారిలో వచ్చే అవకాశం చాలా ఎక్కువ. పురుషులలో కన్నా స్త్రీలలో మూడింతలు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది.
 
కారణాలు
శరీరంలోని జీవక్రియల అసమతుల్యత వలన, రోగ నిరోధక వ్యవస్థలోని మార్పుల వలన ఈ జబ్బు వస్తుంది. దీనితోపాటు శారీరక, మానసిక ఒత్తిడి కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. మానసిక ఒత్తిడి వలన జన్యుపరమైన మార్పులు సంభవించి ఈ జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరైన ఆరోగ్య పద్ధతులు పాటించనివారు, ధూమపానం, మద్యపానం చేసేవారిలో ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది.
 
లక్షణాలు
ఈ కీళ్ల జబ్బు వలన, కీళ్లలో ఉండే సైనవియల్‌ మెంమిబ్రెన్‌ దెబ్బతింటుంది. కీళ్లలో అవసరమైన సైబ్రస్‌ టిష్యూ పేరుకుపోతుంది. దానిని ప్యానస్‌ అంటారు. ఈ ప్యానస్‌ అనే చెడు పదార్థం వలన కీళ్లలో కార్టిలేజ్‌ దెబ్బతింటుంది. కీళ్లలో వాపులు తరచుగా వస్తూ పోతూ ఉంటాయి. ఈ జబ్బులో లక్షణాలు కొన్నిసార్లు అధికం అవడం, తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుంది. ఎప్పుడైతే లక్షణాలు అధికం అయినప్పుడు జ్వరంగా ఉండటం, కీళ్లలో వాపులు, కీళ్లు ఎరుపెక్కడం, కీళ్లు బిగుసుకు పోవడం, తీవ్రమైన నొప్పి, కదలికలు తగ్గిపోతాయి. ఆకలి తగ్గిపోవడం రుమటాయిడ్‌ ఆర్థరైటీస్ తో చేతి మణికట్టు, కీళ్లు, చేతి వేళ్లు, ముంజేతి కీళ్లు, మోకాళ్లు ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ ఆర్థరైటీస్ తో కేవలం కీళ్లు దెబ్బతినడమే కాకుండా, శరీరంలో ఇతర అవయవాలు కూడా దెబ్బతింటాయి.
 
ఊపిరితిత్తుల్లోని హైపో, గుండె పైపోర దెబ్బతినే అవకాశం ఉంటుంది. తద్వారా గుండెనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. తరుచుగా ఊపిరితిత్తులో ఇన్‌ఫ్లమేషన్‌ కారణంగా తుమ్ములు రావడం, దగ్గురావడం జరుగుతుంది. రక్తకణాల సంఖ్య పడిపోయి ఎనిమియాకు కారణం అవుతుంది. ప్లీహంలో వాపు వస్తుంది. కళ్లు, నీరు పొడిపారిపోవడాన్ని జోగ్రెన్‌ సిండ్రోమ్‌ అంటారు. చర్మం కిందిభాగంలో గుళికల్లాంటి ఆకారాలు ఏర్పడతాయయిఇ. వీటిని రుమటాయిడ్‌ నొడ్యుల్స్‌ అంటారు.
 
వ్యాధి నిర్ధారణ
రక్తంలో యాంటీబాడీస్‌ కనుగొనే పరీక్ష రుమటాయిడ్‌ ఫ్యాక్టర్‌ (ఆర్‌ఏ ఫ్యాక్టర్‌) పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు. అలాగే యాంటి సిసిపి, యాంటి సిట్రులినేటెడ్‌, పెప్టైడ్‌ పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు. ఏఎన్‌ఏ పరీక్ష ద్వారా కూడా నిర్ధారించవచ్చు. కీళ్లను ఎక్స్‌రే తీయించి ఎముకలలో ఎరోషన్స్‌ను గుర్తించి నిర్ధారించవచ్చు. సాధారణ పరీక్షలు సీబీపీ, ఈఎస్ ఆర్‌, సీఆర్‌పీ పరీక్షలు కూడా వ్యాధిని నిర్ధారించడంలో సహాయపడతాయి.
 
జాగ్రత్తలు
ఇలాంటి కీళ్లజబ్బుల బారిన పడకుండా ప్రతిరోజు వ్యాయామం చేయాలి. సరియైున పోషకాహారం తీసుకోవాలి. ఎలాంటి వైరల్‌ ఇన్‌ఫెక్లన్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతినిత్యం యోగా, ధ్యానం చేయాలి.
 
హోమియో వైద్యం
రోగి మానసిక, శారీరక లక్షణాలను అనుసరించి హోమియో వైద్యం ఇవ్వడం జరుగుతుంది. లెడంపాల్‌, బ్రయోనియా, రస్టాక్స్‌, కాల్చికమ్‌, బెంజోయిక్‌ యాసిడ్‌, కాలిమూర్‌, పల్సటిల్లా తదితర మందులు ఉపకరిస్తాయి.
  
 డాక్టర్‌ మురళీ అంకిరెడ్డి, ఎం.డి. హోమియో
                                                                                                                                                   స్టార్‌ హోమియోతి, ఫోన్‌- 8977 336677,టోల్‌ఫ్రీ :1800-108-5566
                                                                                                                                                    www.starhomeo.com
                                                                                                                                                    ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, దుబాయ్‌, లండన్‌, మాంచెస్టర్‌