విరిగిన ఎముకలకు జన్యుచికిత్స

19-5-2017: విరిగిన ఎముకలను అతికించడానికి సురక్షితమైన విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఎముకల పెరుగుదలకు దోహదం చేసే డీఎన్‌ఏ ప్రోటీన్లు, మూలకణాలతో కూడిన సూక్ష్మ బుడగలను విరిగిన ఎముక స్థానంలో చేర్చుతారు. అవి ప్రభావవంతంగా పనిచేసి విరిగిన ఎముకను అతికిస్తాయి. సూక్ష్మ బుడగలు, అలా్ట్రసౌండ్‌తో కూడిన రెండు దశల్లో ఉండే ఈ జన్యుచికిత్సను పందుల్లో పరీక్షించి చూశామని యూనివర్సిటీ ఆఫ్‌ జెరూసలెం, యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్సియా సంయుక్త బృందం తెలిపింది. ఎనిమిది వారాలపాటు చికిత్స చేయగా విరిగిన ఎముక యథా స్థితికి చేరుకుందని వెల్లడించారు. ఈ చికిత్సతో ఇన్ఫెక్షన్లు సోకడం, ప్రాణాంతక వ్యాధుల లాంటివి వచ్చే అవకాశం లేదని వివరించారు.