బరువులతో ఎముకలు బలం!

12-12-2017: వెయిట్‌ ట్రైనింగ్‌ అంటే ‘అమ్మో! మగాళ్లలా కండలొచ్చేస్తాయి!’ అనుకుంటారు ఆడవాళ్లంతా! కానీ మహిళల శరీర నిర్మాణం పురుషులకు భిన్నం. పైగా బరువులతో వ్యాయామం చేయటం వల్ల ఎముకలు బలపడతాయి. మరీ ముఖ్యంగా మెనోపాజ్‌కు చేరుకున్న మహిళలు ఎముకలను గుల్లబార్చే ‘ఆస్టియోపోరోసిస్‌’కు గురికాకుండా ఉండాలంటే వెయిట్‌ ట్రైనింగ్‌ చేయటం తప్పనిసరి. ఇందుకోసం....

 కిలోతో మొదలుపెట్టి రెండున్నర నుంచి ఐదు కిలోల వెయిట్స్‌తో వ్యాయామాలు చేయాలి.
 బొమ్మలో చూపించిన విధంగా కాళ్లను దూరంగా ఉంచి నిటారుగా నిలబడాలి.
 రెండు చేతులతో బరువును లేపి మోకాళ్ల మీద వంగి, తిరిగి పైకి లేవాలి.
 ఈ వ్యాయామం వల్ల చేతులు, ఛాతీ, తొడల్లోని కండరాలు బలపడటంతో పాటు ఎముకలూ దృఢపడతాయి.