కీళ్లకు ‘అల్యూమినియం ఫాయిల్‌’

05-02-2018: అల్యూమినియం ఫాయిల్‌ను వంటలకే కాదు, వైద్యానికీ ఉపయోగించవచ్చు. రష్యా, చైనా వైద్యులు కొన్ని వైద్య చికిత్సలకు దీన్ని వాడేవాళ్లు. ఈ ఫాయిల్‌తో జలుబు మొదలుకొని నిద్రలేమి వరకూ గృహ వైద్యం చేయొచ్చన్నది వారి అనుభవం! ఇది అర్థ్రయిటిస్‌, సయాటికా, గౌట్‌, చీలమండల నొప్పులను కూడా తగ్గిస్తుంది. ఎముకల నొప్పులు తగ్గాలంటే, నొప్పిగా ఉన్న ప్రదేశాన్ని అల్యూమినియం ఫాయిల్‌తో చుట్టి, పైన బ్యాండేజీ కట్టాలి. ఇలా ప్రతి రాత్రీ వరుసగా 10 నుంచి 12 రోజులపాటు చేయాలి. తర్వాత రెండు వారాల విరామం ఇవ్వాలి. ఇలా చేస్తే కీళ్ల నొప్పులు తగ్గుముఖం పడతాయి. ఒకవేళ అప్పటికీ తగ్గకపోతే మళ్లీ మరో 10, 12 రోజులపాటు ఫాయిల్‌తో పట్టు వేయాలి.