ఆస్టియోపోరోసిస్‌ రాకుండా!

ఆంధ్రజ్యోతి,14-3-2017:ఎముకలు గుల్లబారకుండా పటిష్టంగా ఉండాలంటే క్రమం తప్పకుండా కొన్ని స్ట్రెంతెనింగ్ ఎక్సర్‌సైజెస్‌ చేయాలి. ఈ వ్యాయామాలను రొటీన్‌ ఫిట్‌నె్‌సలో భాగం చేసుకోండి. 

1.మోకాళ్లు నేలకు ఆనకుండా బోర్లా పడుకుని చేతుల మీద బరువుంచి పైకి లేవాలి. ఇలా 20 సార్లు చేయాలి. 

2.నిటారుగా నిలబడి చేతులను పైకి లేపుతూ, కాళ్లను ఎడం చాపుతూ పైకి ఎగరాలి. ఈ జంపింగ్‌ జాక్స్‌ ఆపకుండా 25 చేయాలి. 

3.చేతలను కలిపి పట్టుకుని కాళ్ల మధ్య ఎడం ఉండేలా కిందకి కుంగి లేవాలి. ఈ స్క్వాట్స్‌ 25 చేయాలి. 

4.పిరమిడ్‌లా ఉండే ఈ శరీర భంగిమ వల్ల శరీరంలోని ఎముకలన్నీ బలపడతాయి. ఈ పిరమిడ్‌ పోజ్‌లో ఉండి 20 అంకెలు లెక్కపెట్టి తిరిగి పైకి లేవాలి.