యూత్‌ను అట్రాక్ట్ చేస్తున్న డాన్స్ యోగా

ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ: నగరానికి వచ్చిన నయా యోగా.. డ్యాన్స్‌ యోగా. డ్యాన్స్‌ ను ఓ ఫిట్‌నెస్‌ మార్గంగా భావించడం మొదలుపెట్టిన తరువాత ఏరోబిక్స్‌, జుంబా లాంటివి వచ్చినట్లే ఇప్పుడు యోగాతో డ్యాన్స్‌ను మిక్స్‌ చేసి డ్యాన్స్‌ యోగా అంటున్నారు
 
యోగా.. ఫిట్‌నెస్‌ కోసం ఇటీవలి కాలంలో ఎక్కువ మంది అనుసరించడానికి వినియోగిస్తున్న మార్గం. అవే సూర్యనమస్కారాలు.. లేదంటే ఆసనాలు... బోర్‌ కొడుతుంది అనే యువత కోసం ఆక్రోయోగా, ఏరియల్‌ యోగా.. ఇలా భిన్న రీతులలో యోగా అందుబాటులోకి వచ్చి వారిలో యోగా పట్ల అభిరుచిని పెంచుతోంది. ఈ క్రమంలో ఆడపాదడపా ఆయా దేశాలతో పాటుగా ఇండియాలో కూడా జరిగిన డ్యాన్స్‌ యోగా ఇప్పుడు నగరానికి వచ్చింది. అనహిత యోగా జోన్‌ ఫౌండర్‌ ప్రతిభా అగర్వాల్‌ ఈ డ్యాన్స్‌ యోగా వర్క్‌షాప్‌ను ఇటీవల ఆలంకృత రిసార్ట్స్‌లో చేసి నగరంలో అధికారికంగా ఈ యోగా వచ్చిందనిపించారు.
 
సెలబ్రేషన్‌ ఆఫ్‌ బాడీ 
డ్యాన్స్‌, యోగా రెండూ ఒకదానితో ఒకటి అనుసంధానించబడినవి. ఈ రెండూ కలిస్తే శరీరానికి అవసరమైన జీవశక్తి వస్తుందన్నది మోడ్రన్‌ యోగా నిపుణుల భావన. అనాదిగా ఆరోగ్యం కొరకు అనుసరిస్తున్న వెల్‌నెస్‌ మార్గాలకు నృత్యం జోడించడంతో పాటుగా సూర్యనమస్కారాలు,ఆక్రోయోగా వంటి వాటిని అనుసంధానించడం ద్వారా డ్యాన్స్‌ యోగా రూపుదిద్దుకుందన్నది యోగా ఇన్‌స్ట్రక్టర్ల మాట. డ్యాన్స్‌తో యోగాను మిళితం చేయడం వల్ల శరీరంలో శక్తిని పూర్తిగా వినియోగించుకోవడం సాధ్యమవుతుందట. నృత్యం, యోగా రెండూ కూడా దాదాపు ఒకే రీతిలో ఉంటాయి కానీ రెండూ విభిన్నమైనవి. ఇదే విషయమై అనహిత యోగా జోన్‌ ఫౌండర్‌ ప్రతిభా అగర్వాల్‌ మాట్లాడుతూ ు డ్యాన్స్‌ యోగా పూర్తి సౌకర్యవంతమైనది. మన శ్వాసతో పాటుగా శరీరం కూడా మూవ్‌అవుతుంది. మనం ఎంత రిజిడ్‌గా ఉన్నా ఈ మూవ్‌మెంట్స్‌ మాత్రం తప్పనిసరి. దాన్ని ఎక్స్‌ప్లోర్‌ చేయాలనుకున్నప్పుడు ఈ డ్యాన్స్‌ యోగా బెస్ట్‌మార్గంగా తోచింది. యోగాలోని బలాన్ని, డ్యాన్స్‌లోని వేగంతో జోడించి దాన్ని శ్వాసతోఅనుసంధానించడం ద్వారా ఈ డ్యాన్స్‌ యోగా తీర్చిదిద్దాం. నాలుగు రోజులు మా ఇన్‌స్ట్రక్టర్లతో కలిసి ప్రాక్టీస్‌ చేసి ఈ మూవ్‌మెంట్స్‌ తీర్చిదిద్దా. యువత నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది్‌ అని అన్నారు. డ్యాన్స్‌ యోగాలో మూవ్‌మెంట్స్‌ చాలా సులభంగా ఉండటమే కాదు.. డ్యాన్స్‌ అసలు రాని వారు కూడా చేసే రీతిలో ఉండటం విశేషం. తమ జీవనశైలిలో క్రమ శిక్షణ అలవాటు చేసుకోవడానికి ఈ డ్యాన్స్‌ యోగా ఉపయోగపడుతుందంటూనే ఆరోగ్యకరమైన జీవనశైలికు కూడా తోడ్పడుతుందని చెబుతున్నారు ఇన్‌స్ట్రక్టర్లు.
 
అలౌకిక ఆనందం.. 
నేటి యువతకు ఇన్‌స్టెంట్‌ ఫలితాలు కావాలి. తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలు కనిపించాలి. జిమ్‌,జుంబా లాంటి ఫిట్‌నెస్‌ యాక్టివిటీల పట్ల మొగ్గు చూపడానికి కారణం ఇదే. తమకు కావాల్సిన వినోదం అందిస్తూనే యాక్టివిటీ ఉండే ఈ తరహా వ్యాయామాలను ఇష్టపడే వారు సీరియ్‌సగా ఆసనాలు చేయడాన్ని అంతగా ఇష్టపడరు. అది దృష్టిలో పెట్టుకునే ఈ డ్యాన్స్‌ యోగా వెలువడిందన్నది ఇప్పటికే ఈ డ్యాన్స్‌ యోగాను ప్రాక్టీస్‌ చేస్తున్న వారి మాట. ప్రతిభా అగర్వాల్‌ సైతం ఇదే చెబుతూ మోర్‌ అండ్‌ మోర్‌ యంగస్టర్స్‌ కోసం తీర్చిదిద్దిర యోగా ఇది. యోగా ను కూడా ఆసక్తికరంగా చేయాలని చేసిన యోగా ఇది. యువతకు టైమ్‌ అసలు ఉండటం లేదు. గంటలోనే కోరుకున్న హెల్త్‌ రిజల్ట్స్‌తో పాటుగా సె్ట్రస్‌నుంచి రిలీఫ్‌ కావాలని కోరుకుంటున్నారు. అందుకే హఠ యోగా, ఆక్రోయోగా, సూర్య నమస్కార్‌ వంటి పోశ్చర్స్‌ను డ్యాన్స్‌తో మిళితం చేసి ఈడ్యాన్స్‌కు రూపకల్పన చేశాం. 10 నిమిషాలలో 25 పోశ్చర్స్‌ ఉండేలా దీన్ని డిజైన్‌ చేశాం. ఈ ఆసనాలు అసాధారణ సె్ట్రంగ్త్‌,బ్యాలెన్స్‌ ఇవ్వడమే కాదు.. బాడీ, మైండ్‌ కో ఆర్డినేషన్‌ కూడా చేస్తాయి. అందరితోనూ స్నేహంగా ఉండేలా తీర్చిదిద్దుతాయి..్‌ అని అన్నారు. ఈ డ్యాన్స్‌యోగా ద్వారా తమ ఫేసియల్‌ మూవ్‌మెంట్స్‌ మారడంతో పాటుగా సన్నబడటం కూడా జరిగే అవకాశాలున్నట్లు ఈ సెషన్స్‌కు హాజరైన వారు చెబుతున్న మాట.
 
డ్యాన్స్‌ యోగాను హైదరాబాద్‌లో మొట్టమొదటిసారిగా ధన్‌తేరస్‌ రోజు చేశాం. రెస్పాన్స్‌ బాగా వచ్చింది. ముఖ్యంగా యువత నుంచి. ఈ డ్యాన్స్‌ యోగా ద్వారా సెన్స్‌ ఆఫ్‌ టుగెదర్‌నెస్‌ పెరుగుతుంది. ఈ యోగా ద్వారా ఫ్లెక్సిబిలిటీ బాగా ఇంప్రూవ్‌ అవుతుంది. 
-ప్రతిభా అగర్వాల్‌, 
అనహిత యోగా జోన్‌ ఫౌండర్‌