యోగాతో లాభాలు నిజం కావేమో!
29-6-2017: శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా తోడ్పడుతుందనే నమ్మకం నూటికి నూరు పాళ్లూ నిజం కాకపోవచ్చని పరిశోధకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కండరాలు, ఎముకల నొప్పులకు యోగా కారణమవుతోందని, ఇప్పటికే ఉన్న గాయాలను అది మరింతగా పెంచుతోందని అధ్యయనంలో వెల్లడికావడమే దీనికి కారణమన్నారు. బాడీవర్క్‌ అండ్‌ మూవ్‌మెంట్‌ థెరపీస్‌ జర్నల్‌ ఈ విషయాన్ని ప్రచురించింది. భారతీయ యోగా ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం సంపాదించుకుంటోంది. యోగా చేసేవారిలో ఒళ్లు నొప్పులతో బాధపడేవారి సంఖ్య ఏటా పది శాతానికి పైగానే ఉంటోందని అధ్యయనంలో తేలిందని సిడ్నీ వర్సిటీ  పరిశోధకులు తెలిపారు.