యోగాతో జ్ఞాపకాలు పదిలం!

15-7-2017: వృద్ధాప్యంలో జ్ఞాపకాలు మసకబారడం సహజమే! అయితే, ఈ పరిస్థితిని యోగాతో తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజూ యోగాసనాలు వేయడం ద్వారా మెదడు చురుకుగా ఉంటుందని చెప్పారు. వయసు పైబడే కొద్దీ మెదడు నిర్మాణంలో, పనితీరులో మార్పులు చోటుచేసుకుంటాయి. సెరెబ్రల్‌ కార్టెక్స్‌ పలుచబడిపోతుంది. ఇది జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు ఏ విషయంపైనా ఏకాగ్రత కుదరదు. అయితే, యోగా ఈ పరిస్థితిని అడ్డుకుంటుందని బ్రెజిల్‌ పరిశోధకులు చె బుతున్నారు.