రిలీఫ్ యోగా

ఆంధ్రజ్యోతి,31-1-2017:యోగా ద్వారా కొన్ని ఆరోగ్య సమస్యలను ఇలా అధిగమించొచ్చు. కూర్చుని ఉద్యోగాలు చేసే వారి సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. గంటల తరబడి ఏసీ రూమ్‌ల్లో కదలకుండా కూర్చోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలెన్నో ! వాటిలో ముందుగా అందరినీ వేధించేది వెన్నుముక సమస్య. మరీ ముఖ్యంగా లోయర్‌ బ్యాక్‌ సమస్యతో సతమతమయ్యే వారెందరో. డాక్టర్‌ దగ్గరకు వెళ్తే మందులిస్తారు. అవి వాడినంత సేపూ బాగానే ఉంటుంది కానీ మరలాసమస్య వస్తూనే ఉంటుంది. దీనికి శాశ్వత పరిష్కార మార్గం యోగా చూపుతుందంటున్నారు యోగా నిపుణులు. ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవడం వల్ల హిప్‌ మజిల్స్‌ బిగుతుగా మారడంతో పాటుగా కుచించుకుపోయే అవకాశాలు కూడా అధికంగా ఉన్నరంటూ దీనివల్లనే లోయర్‌ లేదంటే పెల్విక్‌ ఏరియాలో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయన్నారు అనహిత యోగా జోన్‌ ఫౌండర్‌ ప్రతిభా అగర్వాల్‌. హిప్‌ సె్ట్రచింగ్‌ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. యోగా ఇన్‌స్ట్రక్టర్ల దగ్గరకు వీటిని నేర్చుకోవడానికి ఎక్కువ రోజుల రావాల్సిన అవసరం కూడా లేదని.. ఇంటిలోనే ఆయా యోగాసనాలను ప్రాక్టీస్‌ చేసి సమస్య నుంచి బయటపడవచ్చని కూడా చెబుతున్నారు.

 
హిప్స్‌కు, నడుముకీ సంబంధం ఉంది.. 
శరీరానికి సరిగ్గా మధ్యలో హిప్స్‌ ఉంటాయి. ఈ ప్రాంతంలో మీరు ఫ్లెక్సిబిలిటీ అభివృద్ధి చేసుకుంటే అది మీ శరీరంతో ఉన్న అ్చనుబంధాన్ని కూడా వృద్ధి చేసుకుంటుంది. మీరు బ్యాలెన్స్‌ తో పాటుగా ఫ్లెక్సిబిలిటీ, సె్ట్రంగ్త్‌ను ఈ ప్రాంతంలో పెంచుకుంటే మీ శరీరమంతా కూడా ఆరోగ్యంగానే ఉంటుంది. మరీ ముఖ్యంగా జీవనశైలిలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్న వ్యక్తుల జీవితాల్లో ! అనేది యోగా గురువుల మాట. ప్రతిభా అగర్వాల్‌ ఇదే విషయమై మాట్లాడుతూ హిప్‌ సె్ట్రచ్‌ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయన్నారు. యోగా ప్రాక్టీ్‌సను మరింత సురక్షితంగా, ఆహ్లాదకరంగా మార్చడంలో హిప్‌ ఫ్లెక్సిబల్‌ వ్యాయామాలు దోహదం చేస్తాయంటూనే మొత్తం శరీరానికి ఫ్లెక్సిబిలిటీను, రక్త ప్రసరణను అందిస్తాయన్నారు. లోయర్‌ బ్యాక్‌ లేదంటే కీళ్లలో నొప్పులను హరించడంతో పాటుగా ఎమోషనల్‌ టెన్షన్‌ విడుదల కావడంలో కూడా సహాయపడతాయన్నారు.
 
ఏం చేయాలంటే.. 
యోగా అంటే మీ అంతర్గత ప్రయాణపు అనుభవాలను పొందడం తప్ప మీరు ఎంత గొప్పగా ఆసనం చేశారన్నది కాదు. మీ హిప్స్‌లో స్టెబిలిటీ మెయిన్‌టెన్‌ చేయడం కష్టమనుకుంటే బ్లాంకెట్‌ లేదంటే పిల్లో మీద కూర్చుని కూడా ఈ హిప్‌ సె్ట్రచించ్‌ వ్యాయామాలు చేయవచ్చంటూ కొన్ని రకాల ఆసనాలను గురించి తెలిపారు.
 
గోముఖాసనం.. 
దీని ప్రయోజనాలు అపారం. హిప్స్‌తో పాటుగా థైస్‌, యాంకిల్స్‌, చెస్ట్‌, షోల్డర్స్‌, ట్రైసెప్స్‌, యాంటీరియర్‌ డెల్టాయిడ్స్‌, ఇన్నర్‌ ఆర్మ్‌పిట్స్‌, లాట్స్‌కు ఇది ప్రయోజనం కలిగిస్తుంది. 
సుఖాసన .. ఇది మంచి హిప్‌ ఓపెనర్‌ ఆసనం. కాకపోతే కుర్చీలలో ఎక్కువగా కూర్చునే వారు ఈ ఆసనం వేయడానికి కాస్త కష్టపడాల్సి ఉంటుంది. ఇలాంటి వారికి మడతపెట్టిన దుప్పటిని పెల్వీస్‌ కింద ఉంచుకోవడం కాస్త ఉపకారిగా ఉంటుంది. రెగ్యులర్‌గా దీన్ని ప్రాక్టీస్‌ చేస్తే ఈ ఆసనంలో ఎంతసేపైనా కూర్చోవచ్చు. కాకపోతే మధ్యమధ్యలో కాళ్లను అటు ఇటూ మారుస్తుండాలి.
 
బౌండ్‌ యాంగిల్‌ పోజ్‌ (బద్ద కోణాసనం).. 
ఒకవేళ మీ మోకాళ్లు సరిగా వంగడం లేదనుకుంటే మీ మోకాళ్లకు సపోర్ట్‌ చేయడానికి పిల్లో వాడవచ్చు. మీ లోయర్‌ బ్యాక్‌ కాంప్రమైజ్‌ కావడం లేదంటే ఆర్చింగ్‌ అయినట్లుగా భావిస్తే పిల్లో మీద కూర్చోవచ్చు కానీ మీ చెస్ట్‌ను మాత్రం వీలైనంతగా ఓపెన్‌గా ఉంచడం అవసరం. ఓ ఐదు నిమిషాలు బద్దకోణాసనం చేస్తే మోకాళ్ల సమస్యలకు ఉపశమనం కలుగుతుంది.
 
అధోముఖాసనం.. 
కాళ్లు, చేతులకు అవసరమైన సత్తువ దీనిద్వారా లభిస్తుంది. కాళ్లు, చేతుల మీద బరువు అధికంగా పడటం వల్ల ఇది ఎముకలకు అవసరమైన శక్తిని అందించడంతో పాటుగా ఆస్టియోపోరియోసి్‌సను నివారిస్తుంది. అలాగే వెన్నుముక బలోపేతం చేయడానికి, అది విస్తరించడానికి కూడా ఇది తోడ్పడటంతో పాటుగా అప్పర్‌, మిడిల్‌, లోయర్‌ బ్యాక్‌పై నొప్పి మటుమాయం కావడానికి కూడా సహాయపడుతుంది. ఒక్క పోజ్‌లో 360 డిగ్రీ స్ట్రీచర్‌ను శరీరం పొందుతుంది.
 
ఆనంద బాలాసనం.. 
సరిగ్గా దీన్ని చేస్తే లోయర్‌ బ్యాక్‌ పెయిన్‌ లేదంటే అసౌకర్యం నుంచి పూర్తి ఉపశమనాన్ని ఇది అందిస్తుంది. దీనిలో బెస్ట్‌ పార్ట్‌ ఏమిటంటే.. మీరు కింద పడుకుని ఉండటం. వెల్లకిలా పడుకోవడం వల్ల హిప్స్‌, బ్యాక్‌, బటక్స్‌పై ఉన్న సమస్యలు తొలిగిపోతాయి.
 
సూప్తమత్య్సంద్రేశాసనం.. 
ఇది గ్లూట్స్‌తో పాటుగా ఛాతీ, ఒబ్లిక్‌ వంచడానికి సహాయపడుతుంది.

మలాసనం.. 
గార్లెండ్‌ పోజ్‌లో ప్రయోజనాలలో.. ఇది హిప్స్‌ను తెరువడంతో పాటుగా గజ్జలను కూడా తెరుస్తుంది. యాంకిల్స్‌, లోయర్‌ హార్మ్‌సి్ట్రంగ్స్‌, బ్యాక్‌, నెక్‌ వంచడానికి ఉపయోగపడుతుంది. అబ్‌డోమినియల్స్‌ను టోన్‌ చేయడంతో పాటుగా జీర్ణశక్తి పెంచడం, మెటబాలిజం వృద్ధి చేయడంలో కూ డా సహాయపడుతుం ది. మీ పెల్విక్‌, హిప్‌ జాయింట్స్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. డెలివరీకు ముందు ఈ యోగా చేస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి.