నడుము నాజూకుగా..

ఆంధ్రజ్యోతి, 19-01-2017: నడుము సన్నబడేలా చేసే వ్యాయామాలున్నాయి. ఈ 4 ఎక్సర్‌సైజెస్‌ను అనుసరిస్తే నాజూకైన నడుము దక్కుతుంది.. 
 
1. నిటారుగా నిలబడి రెండు కిలోల వెయిట్స్‌ చేతుల్లోకి తీసుకుని కుడి, ఎడమ వైపుకి శరీరాన్ని వంచాలి. ఇలా రెండు వైపులా 20 సార్లు చేయాలి. 
 
2. వెల్లకిలా పడుకుని కాళ్లను వంచి పైకి లేపాలి. పొట్టను లోపలికి పీల్చి చేతులు రెండు గాల్లోకి లేపి 20 అంకెలు లెక్కపెట్టి రిలాక్స్‌ అవ్వాలి. 
 
 
3. ముందు చెప్పిన భంగిమలోనే ఉండి కాళ్లను, చేతుల్ని మడిచి బొమ్మలో చూపించినట్గు కుడి మోచేయి, ఎడమ మోకాలిని తాకేలా వంగాలి. ఇలా రెండోవైపు కూడా చేయాలి. 
 
4. ట్విస్టర్‌ మీద నిలబడి సాధ్యమైనంత మేరకు శరీరాన్ని అటూ, ఇటూ తిప్పాలి. ఇలా తిప్పేటప్పుడు శరీర కిందిభాగం మాత్రమే కదిలేలా చూసుకోవాలి. ఇలా 50 రిపిటీషన్స్‌ చేయాలి.