ధ్యానంతో తాగుడుకు చెక్‌

25-08-2017: మద్యానికి బానిసలైన వాళ్లు తాగుడు మానాలని చాలా ప్రయత్నిస్తుంటారు. కానీ, తమను తాము నియంత్రించుకోలేక మళ్లీ అదే బాట పడుతుంటారు. అయితే, తాగుడుకు దూరం కావాలంటే ధ్యానం చేయాలని యూకేలోని యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ పరిశోధకులు సూచిస్తున్నారు. రోజుకు కనీసం 11నిమిషాల పాటు ధ్యానం చేస్తే ఒత్తిడి దూరమై మానసిక ప్రశాంతత ఏర్పడి మద్యం సేవించాలన్న భావనను దూరం చేస్తుందని వివరించారు. దాదాపు 68 మంది తాగుబోతులను వారం పాటు పరీక్షించగా వారిలో మద్యం సేవించాలన్న ఆలోచనే దూరం అయ్యిందని వెల్లడించారు. ఈ శాస్త్రవేత్తల బృందంలో భారత సంతతి శాస్త్రవేత్త కూడా ఉన్నారు.