ఇదే జీవనయోగం!

ఆంధ్రజ్యోతి, 27-04-2017: యోగా చేస్తే శరీరమే కాదు మనసూ ప్రశాంతంగా ఉంటుంది. తమిళనాడులోని కోయంబత్తూర్‌కి చెందిన నానమ్మల్‌ అనే పెద్దామె అదే చెబుతోంది. ఈ బామ్మ వయసు 98 ఏళ్లు. ‘ప్రతిరోజూ క్రమం తప్పకుండా యోగా చేయటం వల్లే ఆరోగ్యంగా ఉన్నాన’ని ఆమె చెబుతోంది. అన్నట్లు నానమ్మల్‌ యెగా గురువు కూడా. వందమందికి ప్రతిరోజూ యోగా పాఠాలు చెబుతుంది. ఆమె పదకొండేళ్ల మనవడితో సాయంత్రంపూట సరదాగా యోగాసనాలు వేస్తుంటుంది. సెంచరీ వయసుకు చేరువలో ఉన్న నానమ్మల్‌ ఆసనాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇంత చక్కగా ఆసనాలు వేయటానికి కారణమేంటని అడిగితే ‘అంతా యోగామయం’ అంటుందామె. ఇటీవల బిబిసి వారు నానమ్మల్‌ యోగా లైఫ్‌పై ఓ డాక్యుమెంటరీ తీశారు. ఈ వీడియో నెట్‌లో వైరల్‌గా దూసుకుపోతోంది.