పొడిబారుతుంటే?

20-11-2017: మెనోపాజ్‌కు చేరుకున్న మహిళల్లో యోని పొడిబారి లైంగిక చర్య ఇబ్బందిగా పరిణమిస్తుంది. ఈ సమస్యకు లూబ్రికేటింగ్‌ క్రీమ్‌లు ఉపయోగపడుతున్నా వాటిని అప్లై చేయటం కొంత అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి క్రీమ్‌లతో పని లేకుండా సహజసిద్ధంగానే డ్రైనెస్‌ తొలగిపోవాలంటే ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ఉత్పత్తికి తోడ్పడే సోయా, టోఫూ లాంటి పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. దాంతోపాటు ఈవినింగ్‌ ప్రిమ్‌రోజ్‌ ఆయిల్‌ క్యాప్య్సూల్స్‌ను ప్రతిరోజూ వేసుకోవాలి. కనీసం 1000 మి.గ్రాముల ప్రిమ్‌ రోజ్‌ ఆయిల్‌ క్యాప్సూల్స్‌ను రోజుకొకటి చొప్పున ఆహారంతో వేసుకుంటే వెజైనల్‌ డ్రైనె్‌సతోపాటు చర్మం పొడిబారే సమస్య కూడా తొలగిపోతుంది.