స్ట్రెచ్‌ మార్క్స్‌ పోవాలంటే...

ఆంధ్రజ్యోతి(2-6-15): ప్రెగ్నెన్సీ తరువాత వచ్చే స్ట్రెచ్‌ మార్క్స్‌ స్త్రీలను చాలా ఆందోళనకు గురిచేస్తుంటాయి. వాటిని కనిపించకుండా చేయడం కోసం వాళ్లు నానా తంటాలు పడుతుంటారు. అయితే అవి పూర్తిగా తొలగిపోకున్నా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కనిపించకుండా చేసుకోవచ్చు. 

 

        కోకో, బట్టర్‌ ఉన్న క్రీమ్స్‌ను ఉపయోగించి స్ట్రెచ్‌ మార్క్స్‌ ఉన్న చోట నెమ్మదిగా రోజూ మసాజ్‌ చేయాలి.
స్నానం చేసిన అనంతరం విటమిన్‌-ఇ ఆయిల్‌ను రాసుకోవాలి. ఒక క్రమపద్ధతిలో మార్క్స్‌పైన మసాజ్‌ చేయాలి.
జింక్‌ అధికంగా లభించే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఆకుకూరలు, సోయా బీన్స్‌ స్ర్టెచ్‌ మార్క్స్‌ను తగ్గిస్తాయి. 
ఆల్మండ్‌ ఆయిల్‌, కొబ్బరి నూనె కలిపి క్రమంగా తప్పకుండా మసాజ్‌ చేసినా మార్క్స్‌ చాలా వరకు తగ్గుతాయి.
కడుపు కండరాలను బిగుతుగా చేసే యోగాసనాలు వేసినా ఫలితం ఉంటుంది. 
నీరు ఎక్కువగా తాగాలి. చర్మం పొడిబారకుండా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మార్క్స్‌ను కొంత మేర తగ్గించుకోవచ్చు.