పీసీఓడీ సమస్యకు హోమియో కేర్‌

05-07-2018: ప్రస్తుత ఆధునిక కాలంలో మానవుడి జీవన విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, అధిక మానసిక ఒత్తిడికి లోనవడం, వ్యాయామాలు చేయకపోవడం వంటి వాటివల్ల చాలా మంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరిలో ఎక్కువ శాతం స్త్రీలను వేధిస్తున్న సమస్య పీసీఓడీ. ఈ సమస్య ఉన్న మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల వీరిలో రుతుచక్ర సమస్యలు తలెత్తుతాయి. యుక్తవయస్సు వారిలో తొలిత మొటిమలు, అవాంఛిత రోమాలు, అధిక బరువు వంటివి వస్తాయి. దీనికి సరైన చికత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే డయాబెటిస్‌, గుండె సంబంధిత వ్యాధులకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి.
 
పీసీఓడీ అంటే: అపరిపక్వమైన అండం (ఇమ్మెచ్యూర్‌ ఫాలికల్‌) నీటి బుడగల వలే మారి అండాశయపు గోడలపై ఉండిపోవడాన్ని పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ డిసీజ్‌ (పీసీఓడీ) అంటారు. సాధారణంగా రుతుచక్రం ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11-14 రోజుల మధ్య నెలకు ఒక అండాశయం నుంచి అండం విడుదలయి ఫలదీకరణకు సిద్ధంగా ఉంటుంది. కానీ పీసీఓడీ ఉన్న మహిళల్లో అండాశయం నుంచి అండం విడుదల కాకుండా, అపరిపక్వత చెందిన అండాలు, నీటి బుడగల్లా మారి అండాశయపు గోడలపై కనిపిస్తాయి. ఇలా రెండు అండాశయాలపై నీటి బుడగలు కనిపిస్తే... వైద్య పరిభాషలో దాన్ని బైలేటరల్‌ పీసీఓడీ అంటారు.
 
కారణాలు: ఈ సమస్యకు కచ్చితమైన కారణాలు తెలియలేదు. కానీ కొన్ని జన్యుపరమైన, వంశపారంపర్య అంశాల వల్ల ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఎఫ్‌ఎస్‌హెచ్‌, ఎల్‌హెచ్‌, ఈస్ర్టోజన్‌, టెస్టోస్టిరాన్‌ హార్మోన్ల అసమతుల్యత, సరైన జీవన శైలి లేకపోవడం, జంక్‌ఫుడ్స్‌ ఎక్కువగా తీసుకోవడం, అధిక మానసిక ఒత్తిడి వంటి వాటివల్ల ఈ సమస్య ఏర్పడవచ్చు.
 
ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌: దీనివల్ల రక్తంలో ఇన్సులిన్‌ శాతం పెరిగి, టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ స్థాయిలు పెరుగతాయి. ఇది స్థూలకాయానికి దారితీసి, పీసీఓడీ సమస్యను ప్రేరేపిస్తుంది.
 
లక్షణాలు: నెలసరి రాకపోవడం, నెలసరిలో ఎక్కువ రక్తస్రావం అవ్వడం, నెలసరి సరిగా వచ్చినా అండాశయం నుంచి అండం విడుదల కాకపోవడం, ముఖం, వీపు భాగంలో మొటిమలు, చర్మం ముడతలు, మెడ భాగంలో మందంగా, నల్లగా మారడం, సంతానలేమి సమస్యను ఎదుర్కోవడం, తలనొప్పి, బరువు పెరగడం, జుట్లు రాలిపోవడం, ముఖం, ఛాతీపై మగవారి మాదిరిగా వెంట్రుకలు ఎక్కువగా రావడం, మానసిక కల్లోలం వంటి లక్షణాలు గమనించవచ్చు.
 
దుష్ఫలితాలు: టైప్‌-2 డయాబెటిస్‌, గుండె జబ్బులు, కొలెస్టిరాల్‌ సమస్యలు, అధిక రక్తపోటు, ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌ వంటి సమస్యలకు పీసీఓడీ దారితీస్తుంది.
 
తీసుకోవల్సిన జాగ్రత్తలు: జీవన విధానంలో తగిన మార్పులు చేసుకోవడం ద్వారా... ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. బరువును అదుపులో ఉంచుకోవడం ద్వారా డయాబెటిస్‌, అధిక రక్తపోటు, కొలెస్టిరాల్‌ వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అధిక కొవ్వు పదార్థాలు, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండటం ద్వారా పీసీఓడీ సమస్యను నియంత్రణలో ఉంచవచ్చు.
 
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ వైద్యం: హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌లో అందించే జెనెటిక్‌ కాన్స్‌టిట్యూషనల్‌ చికిత్సా విధానం ద్వారా హార్మోన్ల అసమతుల్యత వల్ల ఏర్పడే వ్యాధులను సమర్థవంతంగా నియంత్రణలో ఉంచే అవకాశం ఉంటుంది. అంతేకాకుండావ్యాయధి సంబంధిత కాంప్లికేషన్లు ఉన్నా, వాటిని తప్పక నియంత్రించవచ్చు. యుక్తవయస్సులోనే దీన్ని గుర్తించి, సరైన చికిత్స తీసుకోవడం వల్ల సంతానలేమి, ఒబేసిటీ వంటి దుష్ఫలితాల నుంచి కాపాడుకోవచ్చు.
 
 
డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లవర్‌ CMD
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌
టోల్‌ ఫ్రీ : 1800 108 1212
ఉచిత కన్సల్టేషన్‌ 9550001188/99
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక,
తమిళనాడు, పాండిచ్చేరి