థైరాయిడ్‌ కనిపెడదాం!

17-04-2018: 30 ఏళ్లు దాటిన ప్రతి మహిళా థైరాయిడ్‌ హెచ్చుతగ్గుల గురించి తెలుసుకోవాలి. ఈ హార్మోన్‌ ఎక్కువైనా, తక్కువైనా సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి లక్షణాలను బట్టి థైరాయిడ్‌ సమస్యను ప్రారంభంలోనే గుర్తించాలి. ఇందుకోసం ఈ 12 లక్షణాలను గమనించాలి.

1. 8 నుంచి 10 గంటలు నిద్రపోయినా అలసటగా ఉండడం.
2. ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం
3. తక్కువ సమయంలోనే బరువు పెరగడం
4. భావోద్వేగాల్లో తీవ్రమైన మార్పులు, కోపం, డిప్రెషన్‌ లక్షణాలు
5. నెలసరి క్రమం తప్పడం
6. గర్భం దాల్చలేకపోవడం
7. కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, టెండనైటిస్‌
8. చల్లని చేతులు, పాదాలు. చలి వేయడం
9. చర్మం పొడిబారి పగలడం, గోళ్లు విరిగిపోతూ ఉండడం, వెంట్రుకలు రాలడం
10. మలబద్ధకం
11. మెదడు మొద్దుబారడం, ఏకాగ్రతాలోపం, జ్ఞాపకశక్తి తగ్గడం
12. మెడ వాపు, గురక, గొంతు బొంగురుపోవడం