రుతుచక్ర సమస్యకు శాశ్వత పరిష్కారం

27-02-2018: స్త్రీలలో రుతుక్రమం చక్కటి ఆరోగ్యానికి నిదర్శనం. అలాంటిది నేటి కాలంలో ప్రతి 10 మందిలో స్త్రీలలో 9 మంది వరకు తమ జీవితకాలంలో ఏదో ఒక రుతుచక్ర సమస్యతో బాధపడుతూ ఉంటారు. వీటి వలన మానసిక ఆందోళన, నీరసం, పని మీద ఏక్రాగత కోల్పోవడం జరుగుతుంది. సాధారణంగా రుతుచక్రంలో మార్పులు- రజస్వల, ప్రెగ్నెన్సీ, ప్రసవం, రుతుచక్రం ఆగిపోయే సమయం వరకూ కనిపిస్తాయి. వీటన్నిటికీ ఎలాంటి వైద్యం అవసరం లేదు. కానీ ఇవి కాకుండా అనేక కారణాల వల్ల రుతుచక్ర సమస్యలు వస్తూంటాయి. వాటిలో ముఖ్యమైనవి- పీసీఓడీ, థైరాయిడ్‌, పైబ్రాయిడ్స్‌, మెనోపాజ్‌ వంటి వాటికి తప్పనిసరిగా చికిత్స తీసుకోవాలి.

 
రుతుచక్ర సమస్యలో రకాలు
అమినోరియా: సాధారణంగా స్త్రీలలో రుతుక్రమం రాకపోవడాన్ని అమినోరియా అంటారు. దీనిని రెండు రకాలుగా విభజించవచ్చు.
 
1) ప్రైమరీ అమినోరియా: స్త్రీలు యుక్త వయస్సుకు వచ్చినప్పటికీ అంటే 16 వయస్సు తర్వాత కూడా రుతుచక్రం ప్రారంభం కాకపోవడం.
 
కారణాలు: క్రోమోజోమల్‌ లేదా జన్యుపరమైన కారణాలు- ముఖ్యంగా 5-అల్ఫా రిడక్టేజ్‌ హార్మోన్‌ ఉత్పత్తి కాకపోవడం వలన స్త్రీ, పురుష లింగ లక్షణాలు సరిగా వ్యత్యాసాన్ని చూపలేవు.
 
సమస్యలు: టర్నర్స్‌ సిండ్రోమ్‌ వంటి సమస్యలు, గర్భాశయ నిర్మాణ మార్పులు, సిస్టిక్‌ ఫైబ్రోసిస్‌, కుషింగ్స్‌ సిండ్రోమ్‌, ఎడ్రినల్‌ గ్రంథి సమస్యల కారణంగా అమినోరియా వచ్చే అవకాశం ఉంది. ఇంతే కాకుండా బరువు తగ్గడం , మానసిక ఒత్తిడి, గర్భాశయ ఇన్‌ఫెక్షన్‌ లేదా క్యాన్సర్‌ నివారణ మందులు, యాంటీ డిప్రెషన్‌ మాత్రలు వాడటం వల్ల కూడా ఈ అమినోరియా సమస్య ఏర్పడుతుంది.
 
2) సెకండరీ అమినోరియా: (సాధారణంగా సంతానోత్పత్తి సమయంలో స్త్రీలలో నెలసరి రాకపోవడాన్ని సెకండరి అమినోరియా అంటారు) అంతవరకూ బహిష్టు ప్రక్రియ సక్రమంగా ఉండి, సంతానోత్పత్తి దశలో మాత్రం 3 నెలల వరకు బహిష్ఠు కాకపోవడాన్ని సెకండరీ అమినోరియా అంటాం.
 
కారణాలు: గర్భధారణ, పిల్లలకు పాలు ఇచ్చే సమయంలో తల్లికి కూడా నెలసరి రాదు. దీని కోసం ఎలాంటి చికిత్స అవసరం లేదు. మెదడులో హైపోథాలమస్‌లోని పిట్యుటరీ గ్రంథి, అన్ని హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. ఈ గ్రంథి ఉన్న ప్రాంతంలో కణితులు ఏర్పడటం వల్ల లేద అధిక ఒత్తిడి వల్ల దీని పనితీరులో సమస్యలు పీసీఓడి, కొన్ని గర్భనిరోధ మాత్రలు వాడటం వల్ల కొన్ని రకాల యాంటీ డిప్రెషన్‌ మందుల వాడకం వల్ల ఎక్కువ సార్లు ‘డైలటేజ్‌ అండ్‌ క్యూరీటేజ్‌’ చేయడం, ఫైబ్రాయుడ్‌ తొలగింపు వంటి ఎండోమెట్రియం పొరలు ఏర్పడని పరిస్థితి సెకండరీ అమోరియాకు దారి తీసింది.
 
ఆలిగోమోనోరియా: రుతుచక్రం ప్రకారం 35 నుంచి 40 రోజుల కంటే ఎక్కువ రోజులకు రుతుస్రావం రావడం లేదా నెలసరి సమయంలో 30 మి.లీ కంటే తక్కువ రుతుస్రావం కావడాన్ని కూడా ఆలిగోమోనోరియా అంటాం.
 
కారణాలు: పీసీఓడీ, పిట్యుటరీ గ్రంథి కణితులు, నెలసరి ఆగిపోయే సమయంలో ఆలిగోమోనోరియా ఏర్పడే అవకాశం ఉంది.
 
మెట్రోరేజియా: రెండు రుతుచక్రాల మధ్యలో రుతుస్రావం కావడాన్ని మెట్రోరేజియా అంటారు. ముఖ్యంగా అండం విడుదల అయ్యే సమయంలో ఇది కనిపించే అవకాశం ఉంది.
 
కారణాలు: అడినోమాస్‌, ఎండోమెట్రియాసిస్‌, ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ, హర్మోన్ల అసమతుల్యత, గర్భనిరోధక పరికరాలు వాడటం, గర్భనిరోధక మాత్రల వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.
 
డిస్మెనోరియా: స్త్రీ సాధారణ దినచర్యలను ప్రభావితం చేసేంతటి తీవ్రమైన పొత్తికడుపు నొప్పి, నెలసరి సమయంలో రావడాన్ని డిస్మెనోరియా అంటారు.
 
కారణాలు: ఎండోమెట్రియాసిస్‌, గర్భాశయంలో కణితులు, అండాశయంలో నీటి తిత్తులు, హార్మోన్ల అసమతుల్యుతలు.
 
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ చికిత్స: హోఇయోకేర్‌ ఇంటర్‌నేషనల్‌లో ఎలాంటి హార్మోన్ల సప్లిమెంటేషన్‌ లేకంఉడా కేవలం జెనెటిక్‌ కాన్‌స్టిట్యూషనల్‌ పద్థతిలో జరిపే చికిత్స ద్వారా రుతుచక్ర సమస్యలకు మూల కారణమైన హార్మోన్ల అసమతుల్యతను, పీసీఓడీతో పాటుగా గర్భాశయం ఇతర సమస్యలను సరిచేసి ఆరోగ్యంగా ఉండేలా ఎటువంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ లేకుండా రుతుచక్ర సమస్యలను సరిజేసే అవకాశం ఉంది.
 
 
 
-డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లవర్‌ ఇకఈ
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌
టోల్‌ ఫ్రీ : 1800 108 1212
ఉచిత కన్సల్టేషన్‌ 9550001188/99
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేర