ఒత్తిడివల్ల గర్భవిచ్ఛిత్తి

07-09-2017: ఇరవైఏళ్ళ వయసులో ఎక్కువ ఒత్తిడికి గురయ్యే మహిళలకు గర్భవిచ్ఛిత్తి అవకాశాలు ఎక్కువ. వీరిలో 42 శాతం కంటే ఎక్కువగా గర్భవిచ్ఛిత్తి అవకాశాలున్నాయి. అంటే కాబోయే తల్లి ప్రమేయం లేకుండానే గర్భం కోల్పోవడం, నెలలు నిండకుండా ప్రసవం లేదా తొందరగా జన్మించి మరణించడం వంటి (Miscarriage) సమస్యలొస్తాయి. మొదటి ఆరునెలల్లో 20 శాతం గర్భవతుకు ఈ సమస్య సర్వసాధరణమే. కానీ ఇటీవల యువతులు అధికఒత్తిడికి గురవుతున్నందువల్ల ఈ కేసులు చాలా ఎక్కువ పెరిగే అవకాశాలున్నాయని ఒక అధ్యయనం పేర్కొంది. Miscarriage కి, హై లెవెల్‌ స్ర్టెస్‌కి స్పష్టమైన సంబంధమున్నట్లు అధ్యయన విశ్లేషణలు పేర్కొంటున్నాయి. లండన్‌ యూనివర్సిటీ కాలేజ్‌, చైనా Zhejang యూనివర్సిటీలలో ఈ అధ్యయనం చేశారు. యుక్తవయస్సుకు ముందే తీవ్ర ఒత్తిడి జీవితం, సుదీర్ఘకాలం ఒత్తిడికి గురయ్యే యువతుల్లో గర్భవిచ్ఛిత్తి ఎక్కువ. సాంఘిక సమస్యలు, మానసిక భావోద్వేగ వేదనలు, డబ్బు, భాగస్వామి సమస్యలు, వంటి సైక్లాజికల్‌ సవాళ్ళకు గురయ్యేవారిలో ఈ మిస్‌కేరేజ్‌ అవకాశం ఎక్కువ. యోగా, శ్వాస సంబంధ వ్యాయామాలు, ఈత, వాకింగ్‌, మంచి సమతుల ఆహారం తినడం, తొందరగా నిద్రించడం, ప్రేమించేవారి చెంత గడపడం ద్వారా మిస్‌కేరేజ్‌ను తప్పించుకోవచ్చునని అధ్యయనం పేర్కొంది.