మల్లెలతో మస్తు ఆరోగ్యం!

07-02-2018: మల్లెపూలు సువాసనకే కాదు, ఆరోగ్యానికీ మంచిదే అంటున్నారు నిపుణులు. మల్లెలతో తయారు చేసిన టీ షుగర్‌ పేషెంట్లకు మంచిదని వారు సూచిస్తున్నారు. రక్తంలో చక్కెర శాతాన్ని అదుపుచేసే శక్తి ఈ టీకి ఉంటుందనీ, షుగర్‌ పేషెంట్లు రోజుకు ఒకసారన్నా మల్లెపూలతో తయారు చేసిన టీ తాగడం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చని వారు సూచిసున్నారు. అంతే కాకుండా వ్యాధినిరోధక శక్తి పెరగడానికి సహాయపడుతుందనీ, అధికబరువును అదుపులో ఉంచడానికి దోహదకారి అవుతుందని వారు చెబుతున్నారు. ఒక స్పూన్‌ టీ పొడికి ఏడురెట్లు సమానంగా తాజా మల్లెలు తీసుకొని ఈ రెండింటిని ఒక గిన్నెలో వేసి గ్లాసు మరిగిన నీటిని పోసి కొద్దిసేపు మూత పెట్టాలి. అనంతరం ఈ నీటిని వడకట్టి తేనె లేదా చక్కెర కలుపుకుని తాగాలని వారు సూచిస్తున్నారు. ఈ విధంగా కొన్ని రోజుల పాటు తాగితే దీర్ఘకాలంగా బాధిస్తున్న కొన్ని ఆరోగ్య సమస్యలకు కొంత వరకూ పరిష్కారం లభిస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు.