వెన్నతో ముప్పు తప్పదు!

07-03-2018: వెన్న ఆరోగ్యానికి మంచిదంటారు చాలా మంది. ఈ అభిప్రాయం తప్పు అంటున్నారు అధ్యయనకారులు. రోజుకి రెండు స్లైసుల వెన్న తీసుకుంటే టైపు 2 డయాబెటీస్‌ వచ్చే ముప్పు చాలా ఎక్కువగా ఉంటుందని వీరి అధ్యయనంలో వెల్లడైంది. 34వేల మంది మీద వీరు సుదీర్ఘకాలం అధ్యయనం చేశారు వీరిలో సగమందికి ప్రతిరోజూ 12 గ్రాముల వెన్నను అందించారు. మిగతావారికి వెన్న లేని ఆహారం ఇచ్చారు. తరువాత వీరి ఆరోగ్య స్థితిని పరిశీలించగా వెన్న తీసుకున్న వారిలో 50 శాతం మందిలో టైపు 2 డయాబెటీస్‌ను గుర్తించారు. వెన్న తీసుకోని వారి ఆరోగ్యంలో ఈ మార్పును గమనించలేదు.  నిపుణుల సలహా మేరకే వెన్న వాడకం మంచిదని వీరు సూచిస్తున్నారు.