చెర్రీ జ్యూస్‌తో బీపీకిచెక్‌!

16-05-2018: చెర్రీజ్యూస్‌కీ, బీపీకి సంబంధముందంటున్నారు నిపుణులు. పలు ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే బీపీని అదుపులో ఉంచుకోవాలంటే ప్రతిరోజూ చెర్రీజ్యూస్‌ తాగవలసిందే అని వారు చెబుతున్నారు. రోజువారీ పనులకు తోడు రకరకాల ఒత్తిడిలు కూడా అధికరక్తపోటుకు కారణమవుతాయన్న సంగతి తెలిసిందే! దీన్ని అదుపులో ఉంచుకోవాలంటే ప్రతిరోజూ గ్లాసు చెర్రీ జ్యూస్‌ తాగితే సరిపోతుందంటున్నారు. ఈ పండులో లభించే విటమిన్లు, పోషకాలు అధికరక్తపోటును అదుపులో ఉంచుతాయట! బీపీని అదుపులో ఉంచుకోగలిగితే గుండె సంబంధవ్యాధులు, పక్షవాతం వంటివాటి నుంచి కూడా తప్పించుకోవచ్చు.