మధుమేహులకు ఆల్కాహాల్‌ చేదా

మధుమేహబాధితులు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో చాలామందికి తెలుసు. కానీ ఆల్కహాల్‌ విషయంలో  ఎలాంటి జాగ్రత్తలు అనుసరించాలో మటుకు చాలామందికి తెలియదు. మధుమేహులు ఆల్కహాల్‌ తాగొచ్చా?  తాగేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు  తీసుకోవాలి వంటి వాటి గురించి ఈ వారం తెలుసుకుందాం..

మన చుట్టూరా ఎంతోమంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వీళ్లల్లో ఆల్కహాల్‌ తాగేవాళ్లు కూడా ఉంటారు.   వీళ్లు  అతిగా ఆల్కహాల్‌ తాగితే తలెత్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అందుకే  అమెరికన్‌ డయాబెటిస్‌ అసోసియేషన్‌ చెప్పిన ప్రకారం ఆల్కహాల్‌ తీసుకోవాలనుకునే మధుమేహవ్యాఽధిగ్రస్తులు ముఖ్యంగా మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వారి షుగర్‌ నియంత్రణలోనే ఉందా లేదా  గమనించుకోవాలి.  రెండవది డయాబెటిక్‌ నరాల జబ్బు ,అధిక రక్తపోటులాంటి  అనారోగ్య సమస్యలు వారికున్నాయా అన్నది  తేల్చుకోవాలి. మూడవది ఆల్కహాల్‌ తీసుకోవడంవల్ల కలిగే హాని, దుష్ప్రభావాల గురించిన అవగాహన ఉండాలి. ఇవి తెలిస్తే ఆల్కహాల్‌ వినియోగంలో ఆచితూచి ప్రవర్తిస్తారు. అనారోగ్యంపాలు కారు. ఆల్కహాలు తాగడం వల్ల ఉండే ముఖ్యమైన సమస్య ఏమిటంటే తాగిన వెంటనే ఇది  నేరుగా రక్తంలో కలుస్తుంది. కడుపులో దీని జీవక్రియ జరగదు.  కాలేయంలో జరుగుతుంది.  ఇక్కడ పేర్కొనవలసిన మరో ప్రధాన అంశమేమిటంటే  సల్ఫోనిలురియా, మెగ్లిటినైడ్‌ లాంటి డయాబెటిస్‌ మందులు పాంక్రియా్‌సపై తీవ్ర ప్రభావం చూపి ఎక్కువ ఇన్సులిన్‌ని ఉత్పత్తి చేస్తాయి. ఆల్కహాల్‌ తీసుకున్నప్పుడు లోబ్లడ్‌షుగర్‌  తలెత్తే అవకాశం ఉంది. 

ఎందుకంటే కాలేయం బ్లడ్‌షుగర్‌ని క్రమబద్ధీకరించడానికి బదులు రక్తంలోంచి ఆల్కహాల్‌ను తొలగించే పనిలో ఉంటుంది. అందుకే మధుమేహవ్యాధిగ్రస్థులు ఆల్కహాల్‌ తాగేటప్పుడు బ్లడ్‌షుగర్‌ ప్రమాణాలు ఎలా ఉన్నాయో గమనించుకుని తదనుగుణంగా ఆల్కహాల్‌ తీసుకోవాలి.   శరీరంలో షుగర్‌ ప్రమాణాలను జాగ్రత్తగా గమనించుకుంటుండాలి. అంతేకాదు బింజి డ్రింకింగ్‌, ఖాళీ కడుపుతో ఆల్కహాల్‌ తాగడం, రకరకాల డ్రింకులు కలుపుకుని తాగడం, వ్యాయామాలు చేయడం వల్ల కూడా శరీరంలో షుగర్‌ ప్రమాణాలు పడిపోయే ప్రమాదం ఉంది. ఎక్కువ ఆల్కహాల్‌ తీసుకున్నా, తక్కువ బ్లడ్‌ షుగర్‌ ఉన్నా ఒకే రకమైన లక్షణాలు కనపడతాయి. నిద్ర నిద్రగా అనిపిస్తుంది. తలతిరుగుతున్నట్టు, అన్‌రె్‌్‌స్టగా ఉంటుంది. అంతేకాదు ఎక్కువ ఆల్కహాల్‌ తీసుకుంటే ఇన్సులిన్‌ ఎఫెక్ట్‌ తగ్గిపోయే ప్రమాదం ఉంది.  దాంతో బ్లడ్‌షుగర్‌ ప్రమాణాలు పెరిగిపోతాయి. ఇది చాలా ప్రమాదకరం.  

జాగ్రత్తలు:
ఖాళీ కడుపుతో ఆల్కహాల్‌ తీసుకోకూడదు.  ఆల్కహాల్‌ తీసుకునేముందు, తీసుకునేటప్పుడు ఏదైనా ఆరోగ్యకరమైన స్నాక్‌ను తప్పనిసరిగా తినాలి. వెజిటబుల్‌ సలాడ్‌తోపాటు నట్స్‌ తింటే మంచిది. లేదా ఆల్కహాల్‌ తీసుకునేటప్పుడు ఎగ్‌వైట్స్‌ తీసుకున్నా మంచిది. ఇవి కాకుండా రోస్ట్‌  లేదా గ్రిల్డ్‌ ఫిష్‌,ఇతర నాన్‌వెజ్‌ ఐటమ్‌  తినొచ్చు.  అయితే వీటితో పాటు వెజిటబుల్‌ సలాడ్‌  తీసుకుంటే మంచిది.  ఆల్కహాల్‌ తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన స్నాక్‌ ఉండేలా జాగ్రత్తపడాలి.
- నాన్‌ఆల్కహాలిక్‌ డ్రింకులు ముందర తాగి ఆ తర్వాత ఆల్కహాల్‌ తీసుకుంటే మంచిది. ఇలా చేయడం వల్ల ఆల్కహాల్‌ ఎక్కువ కాకుండా మితంగా తీసుకుంటారు.    సోడా లేదా నీళ్లను కలుపుకుని తాగితే మంచిది. సాఫ్ట్‌ డ్రింకులు , ప్రొ-డైట్‌ ప్రాడక్టులను ఆల్కహాల్‌లో కలుపుకుని తాగొద్దు.
- ఆల్కహాల్‌ తాగేటప్పుడు వేగంగా కాకుండా మెల్లమెల్లగా సిప్‌ చేస్తూ తాగాలి. ఇలా చేయడం వల్ల బ్లడ్‌ షుగర్‌ మీద ఎక్కువ ప్రభావం పడదు.
 
ఏ డ్రింకు.. ఎన్ని కేలరీలు 
హార్డ్‌ లిక్కర్స్‌:
1.వోడ్కా 44ఎంఎల్‌-96 కేలరీలు
2.విస్కీ 44ఎంఎల్‌ -96 కేలరీలు 
3.టకీలా 44ఎంఎల్‌-96 కేలరీలు
4. రమ్‌ 44 ఎంఎల్‌-100 కేలరీలు
వైన్స్‌:
1.వైట్‌ వైన్‌ 1 గ్లాసు(153ఎంఎల్‌)-121 కేలరీలు
2.రెడ్‌ వైన్‌ 1 గ్లాసు (153ఎంఎల్‌)-129 కేలరీలు
3.షాంపైన్‌ 1 గ్లాసు(121ఎంఎల్‌)-78 కేలరీలు
కాక్‌టైల్స్‌:
1.మార్గరీటా 97ఎంఎల్‌-153 కేలరీలు
2.బ్లడీ మారీ 295ఎంఎల్‌-125 కేలరీలు
ఆల్కహాలిక్‌ బెవరేజెస్‌:
1. బ్రీజర్‌ 275ఎంఎల్‌-96 కేలరీలు
2 బీర్‌ ఒక క్యాన్‌-110 కేలరీలు