తగాదాలతో పెరిగే మధుమేహం

21-05-2018: జీవిత భాగస్వామితో తరచుగా తగువులు పడుతున్నారా? దాని ప్రభావం మనసు మీదే కాదు ఆరోగ్యం మీదా పడుతుందని తెలుసుకోండి. పెన్సిల్వేనియా స్టేట్‌ యూనివర్శిటీ పరిశోధకులు చేపట్టిన పరిశోధనలో, తరచుగా జీవిత భాగస్వాములతో తగాదాలు పడుతూ ఉండేవాళ్లలో ఆర్థ్రయిటిస్‌, మధుమేహం సమస్యలు మరింత పెరు గుతున్నట్టు తేలింది. ఆర్థ్రయిటిస్‌, మధుమేహం సమస్యలు ఉన్న రెండు వర్గాల వ్యక్తుల మీద విడివిడిగా జరిపిన పరిశోధనలో, జీవిత భాగస్వామితో తగాదాలు పడ్డవాళ్లు అదే రోజున వారి ఆరోగ్య సమస్యల తీవ్రత పెరిగినట్టు చెప్పారు. కాబట్టి ఆరోగ్య సమస్యలు మరింత దిగజారకుండా ఉండాలంటే జీవిత భాగస్వామితో తగువులు పడడం మాని సానుకూలంగా సమస్యలు పరిష్కరించుకోవడం మొదలుపెట్టండి.