కంటి నిండా కునుకు లేకుంటే మధుమేహం?

28-07-2017: కంటి నిండా నిద్రలేకపోతే ? తొలుత ఊబకాయం, తర్వాత మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాదుల బారిన పడే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో తేలింది. సగటున రోజు రాత్రిపూట 6 గంటల పాటు నిద్రించే వారు బరువు పెరుగుతున్నారని యూనివర్సిటీ ఆఫ్‌ లీడ్స్‌ పరిశోధకులు తెలిపారు. ఇది రకరకాల వ్యాధులకు కారణమవుతోందని, ముఖ్యంగా మధుమేహ ముప్పును ప్రమాదకర రీతిలో పెంచుతోందని వివరించారు. అదే రోజూ రాత్రిపూట 9 గంటల పాటు నిద్రించే వారికి ఈ ముప్పు తక్కువని తెలిపారు.