మతిమరుపునకు ఇలా చెక్‌ పెట్టొచ్చట!

15-08-2017: తరచుగా మతిమరపుతో ఇబ్బంది పడుతున్నారా? ఇంటి నుంచి బయటకు వెళ్లేటపుడు ముఖ్యమైన వస్తువులు మర్చిపోతున్నారా? ఒక్క చిన్న ట్రిక్‌ ద్వారా ఈ ఇబ్బందికి చెక్‌ పెట్టొచ్చట. రెండు వస్తువులను అనుసంధానం చేయడం ద్వారా మతిమరుపు ఇబ్బందులను అధిగమించవచ్చని కెనడాలోని రాట్‌మన్‌ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఉదాహరణకు గొడుగును బయటకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు తలుపు గడియకు దానిని తగిలించాలట. ఇంటి నుంచి బయటకు వెళ్లేటపుడు ఆ గొడుగు తీస్తేనే తాళం వేయడానికి వీలవుతుంది. ఇలా ముఖ్యమైన వస్తువులను వేరే వస్తువులకు అనుసంధానం చేయడం ద్వారా మతిమరపునకు చెక్‌ పెట్టొచ్చని పరిశోధకులు వెల్లడించారు.