ఆ ఇబ్బంది ఎందుకు?

ప్రశ్న: నాకు కొత్తగా పెళ్లైంది. కొద్ది రోజులుగా వాసనతో కూడిన స్రావం విడుదలవుతోంది. మూత్రంలో మంటతోపాటు కలయిక సమయంలో నొప్పిగా ఉంటోంది. ఇదేమైనా ఇన్‌ఫెక్షనా?

- ఒక సోదరి, గుంటూరు.
 
సమాధానం: లక్షణాలనుబట్టి మీకు ‘క్లమీడియా’ ఇన్‌ఫెక్షన్‌ సోకిందని అనిపిస్తోంది. ఇది స్త్రీపురుషులిద్దరికీ వస్తుంది. ఒకరి నుంచి మరొకరికి కలయిక ద్వారా సంక్రమిస్తుంది. ఈ ఇన్‌ఫెక్షన్‌ మరింత ముదిరితే, కలిసినప్పుడు యోనితోపాటు పొత్తికడుపులో నొప్పి, జ్వరం ఉంటాయి. ఈ ఇన్‌ఫెక్షన్‌ మలద్వారానికి కూడా పాకొచ్చు. అప్పుడు మలద్వారంలో నొప్పి, స్రావం కనిపిస్తాయి. ఇది సర్వసాధారణమైన సెక్సువల్‌ ఇన్‌ఫెక్షన్‌. ఈ ఇన్‌ఫెక్షన్‌ మహిళల్లో యోని, మలద్వారం, గొంతులో వస్తే, పురుషుల్లో శిస్నం లోపల, గొంతు, మలద్వారంలో వస్తుంది. ఈ ఇన్‌ఫెక్షన్‌ ఉన్న వ్యక్తులతో కండోమ్‌ లేదా ఎటువంటి సురక్షిత పద్ధతులు పాటించకుండా, సాధారణ లేదా మలద్వార కలయిక జరిపితే వ్యాధి సంక్రమిస్తుంది. ముఖరతి జరిపినా కూడా సోకుతుంది. కాబట్టి క్లమీడియా అని అనుమానం వస్తే ఆలస్యం చేయకుండా సెక్సాలజిస్ట్‌ని సంప్రతించండి.

డాక్టర్‌ షర్మిలా మజుందార్‌,
సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకో అనలిస్ట్‌,
email: mili77@gmail.com (కన్సల్టేషన్‌ కోసం)