అవి పూర్తి రక్షణ కల్పిస్తాయా?

ఆంధ్రజ్యోతి, 08-01-2019: 

ప్రశ్న: డాక్టర్‌! కండోమ్స్‌ అన్ని సుఖవ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయా? నా స్నేహితుడు ఒకరికి కండోమ్‌ వాడినా సుఖవ్యాధి సంక్రమించింది. ఇది ఎలా సాధ్యం?
(ఓ సోదరుడు, ఖమ్మం)
 
 
జవాబు: సెక్స్‌లో పాల్గొన్న ప్రతిసారీ (స్త్రీపురుషులు) కండోమ్‌ సక్రమంగా వాడితే లైంగిక వ్యాధులు సోకకుండా ఉంటాయి. అయితే సెక్స్‌ ద్వారా వైరస్‌లు ఒకరి నుంచి మరొకరికి సోకకుండా కండోమ్‌లు రక్షణ కల్పించినా, ఆ సమయంలో అనుసరించే ఇతర చర్యల వల్ల వ్యాధులు సంక్రమిస్తూ ఉంటాయి. ఉదాహరణకు, ఓరల్‌ సెక్స్‌ ద్వారా హెపటైటిస్‌ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. అలాగే కొన్ని రకాల ఫోర్‌ప్లేల ద్వారా కూడా వైరస్‌లు సోకుతాయి. హెర్పిస్‌ కారక పుండ్లు ఉన్న వ్యక్తితో సఖ్యతగా మెలిగినప్పుడు, చర్మం ద్వారా చర్మంలోకి చొరబడి వ్యాధిని కలుగజేస్తాయి. కాబట్టి పెళ్లికి ముందు అపరిచిత వ్యక్తులతో సెక్స్‌లో పాల్గొనకపోవడమే మేలు.
 
పెళ్లి తర్వాత అక్రమ సంబంధాలు నెరపడం కూడా ప్రమాదకరమే! కండోమ్స్‌ను కూడా పూర్తిగా నమ్మలేం! నాణ్యత లేని కండోమ్స్‌ చిరిగిపోవచ్చు. కొన్నిసార్లు వదులై లోపలే జారిపోవచ్చు. కాబట్టి వాటి మీద భారం వేసి లైంగిక చర్యల్లో పాల్గొనడం ప్రమాదకరం. అన్ని రకాల లైంగిక వ్యాధులకూ సమూలంగా చికిత్స చేయలేం! కొన్ని దీర్ఘకాలం వేధించి ఆరోగ్యాన్ని కుదేలు చేస్తాయి. కొన్ని పుట్టబోయే పిల్లలకూ సంక్రమిస్తాయి. చికిత్స లోపిస్తే, పుట్టే పిల్లల్లో అవయవలోపాలను కలుగుజేస్తాయి. కాబట్టి కండోమ్స్‌ విషయంలో సరైన అవగాహనతో మెలగాలి.
 
 
-డాక్టర్‌ షర్మిలా మజుందార్‌,
సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకో అనలిస్ట్‌
mili77@gamil.com (కన్సల్టేషన్‌ కోసం)