సర్జరీ చేసినా ఫలితం ఉండదా?

09-10-2018: డాక్టర్‌! నాకు స్పెర్మ్‌ కౌంట్‌ చాలా తక్కువగా ఉంది. డాక్టరును కలిస్తే వెరికోసిల్‌ ఉందనీ, సర్జరీ చేస్తే కౌంట్‌ పెరుగుతుందనీ చెప్పారు. కానీ సర్జరీ తర్వాత కూడా శుక్రకణాల సంఖ్య పెరగలేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి?
ఓ సోదరుడు, మహానంది
 
శుక్ర కణాల తరుగుదలకూ వెరికోసిల్‌కూ సంబంధం ఉంది. అయితే వెరికోసిల్‌ రెండు, లేదా మూడవ దశల్లోనే సర్జరీ అవసరమవుతుంది. మొదటి దశలో మందులు వాడితే సరిపోతుంది. నిజానికి శుక్ర కణాల సంఖ్య తగ్గడానికి వెరికోసిల్‌ ఒక కారణం మాత్రమే! ఈ సమస్యకు మరెన్నో కారణాలుంటాయి. పరీక్షలు చేసి, స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గడానికి వెరికోసిల్‌ అని నిర్ధారణ అయితేనే సర్జరీ చేయాలి. పైగా వెరికోసిల్‌ సర్జరీ అనుభవజ్ఞులైన వైద్యుల చేత మాత్రమే చేయుంచుకోవాలి. లేదంటే వృషణాలకు హాని జరిగి, స్పెర్మ్‌ కౌంట్‌ మరింత తగ్గే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీర్యంలో శుక్రకణాల సంఖ్య 50 వేలు అంతకంటే తగ్గితే అనుభవజ్ఞులైన వైద్యులను కలిసి అసలు కారణాన్ని తెలుసుకోవాలి. సమస్యకు తగిన చికిత్స తీసుకోవాలి.
 
డాక్టర్‌ రాహుల్‌రెడ్డి
ఆండ్రాలజిస్ట్‌,
ఆండ్రోకేర్‌ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్‌,
జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌.