కోరికలు తగ్గడానికి కారణం?

ఆంధ్రజ్యోతి, 15-01-2019: 

ప్రశ్న: డాక్టర్‌! పురుషుల్లో లైంగిక కోరికలు తగ్గడానికి కారణం ఏంటి? అందుకూ, వయసుకూ సంబంధం ఉందా? యుక్త వయస్కుల్లో సెక్స్‌ పట్ల ఆసక్తి తగ్గితే చికిత్స తీసుకోవడం అవసరమా?

(ఓ సోదరుడు, కర్నూలు)
 
యుక్తవయస్కులైన పురుషుల్లో లైంగిక కోరికలు తగ్గడానికి చాలా కారణాలుంటాయి. మద్యపానం, వ్యక్తిగత, వృత్తిపరమైన ఒత్తిళ్లు, మానసిక, శారీరక సమస్యలు, తమ శరీరాకృతి పట్ల అయిష్టతలు, తమ లైంగిక సామర్ధ్యం పట్ల అనుమానాలు, భయాలు, అసంతృప్తులు... ఇలా లైంగిక కోరికలు తగ్గడానికి ఎన్నో కారణాలుంటాయి. కొన్ని సందర్భాల్లో విపరీతంగా వ్యాయామం చేయడం వల్ల కలిగే అలసట కారణంగా, ఊపిరి సలపని పనుల కారణంగా కూడా కోరికలు తగ్గుతాయి. టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ తగ్గినా లైంగికాసక్తి తగ్గుతుంది. అయితే ఇలా యుక్తవయస్కులైన పురుషుల్లో జరగడం అరుదు. అయినా రక్త పరీక్షతో హార్మోన్‌ పరిమాణాన్ని గుర్తించే వీలుంది. అయితే ఎక్కువ శాతం లైంగిక సమస్యలు, లైంగిక కోరికలు తగ్గడం లాంటివి అసలు కారణాన్ని గుర్తించి, సరిదిద్దితే తక్కువ వ్యవధిలోనే సర్దుకుంటాయి. వైద్యుల సహాయం అవసరం అనుకుంటే సెక్సాలజిస్ట్‌ని కలిసి చికిత్స తీసుకోవచ్చు.
 
డాక్టర్‌ షర్మిలా మజుందార్‌
సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకో అనలిస్ట్‌
mili77@gmail.com
9676762665 (కన్సల్టేషన్‌ కోసం)