`కనిపించేదంతా నిజం కాదు

27-11-2017:మరీ ముఖ్యంగా లైంగికపరమైన విషయాల్లో ఈ నిజాన్ని అంగీకరించాల్సిందే! పోర్న్‌ వీడియోలకూ, నిజ జీవితంలో పడగ్గది శృంగారానికీ ఎంతో తేడా ఉంటుంది. ఆ వీడియోల్లో కనిపించేదాన్ని నిజ జీవితానికి అన్వయించుకుంటే భంగపాటు, నిస్పృహలు తప్పవు. అశ్లీల వీడియోల్లో సాధారణంగా కనిపించే వాస్తవ విరుద్ధాలు...ఇవే!

వీడియోల్లో కనిపించే మహిళలు పెనట్రేటివ్‌ సెక్స్‌తో సంతృప్తి పొందినట్టు కనిపిస్తారు. కానీ ఎక్కువ మంది అలా నటిస్తారంతే! నిజానికి అలా భావప్రాప్తి పొందే మహిళలు కేవలం 10 శాతమే!
సైజు విషయంలో, ముఖ్యంగా పురుషులను అశ్లీల వీడియోలు ఆత్మన్యూనతకు లోను చేస్తూ ఉంటాయి. వీడియోల్లో కనిపించే సైజుల్ని సరిపోల్చుకోవటం కరెక్టు కాదు. పరిమాణం కాదు ప్రభావం ముఖ్యం.
ప్రిమెచ్యూర్‌ ఇజాక్యులేషన్‌ (శీఘ్ర స్ఖలనం) సమస్య లేకపోతే, సాధారణంగా పురుషులకు మూడు నిమిషాల్లోనే భావప్రాప్తికి చేరుకోకుండా ఉండలేరు.
మీరు ప్రొఫెషనల్‌ జిమ్నాస్ట్‌లు అయితే తప్ప పోర్న్‌ వీడియోల్లో కనిపించే భంగిమలను అనుసరించలేరు. ఆసక్తిగా, కొత్తగా కనిపించే ఆ భంగిమలు దంపతులిద్దరికీ, అందరికీ అనుకూలించకపోవచ్చు.
చిటికె వేసినంత త్వరగా, తేలికగా మహిళలు లైంగిక చర్యకు సిద్ధపడిపోవటం ఎక్కడా జరగదు. లైంగిక క్రీడకు వాళ్లని సన్నద్ధం చేయాలంటే కనీసం 10 నుంచి 15 నిమిషాల ఫోర్‌ప్లే ఉపరతి అవసరం.