సహజసిద్ధంగా లైంగిక తృప్తి పొందేదెలా?

30-01-2018 ప్రశ్న: డాక్టర్‌! స్వయంతృప్తి, ముఖరతి...ఈ రెండింటి ద్వారా మాత్రమే నేను లైంగిక తృప్తి పొందగలుగుతున్నాను. భాగస్వామితో సహజరతిలో నాకు ఎలాంటి తృప్తీ కలగట్లేదు. ఇలా ఎందుకు? సమస్య నా మనసులో ఉందా? లేక శరీరంలోనా?
 
జవాబు: అన్నిటికంటే ముందు మీ పరిస్థితే ఎంతోమందికి ఉంటుందని గ్రహించండి. దాదాపు 70 శాతం మంది మహిళలు పెనట్రేటివ్‌  మినహా మిగతా పద్ధతుల్లో మాత్రమే లైంగిక తృప్తి పొందగులుగుతారు. సహజ రతి ద్వారా వాళ్లు భావప్రాప్తికి చేరుకోవటం కష్టం. స్త్రీ సంపూర్ణంగా భావప్రాప్తి పొందాలంటే వారి క్లెటోరిస్‌ ప్రాంతంలో తగినంత రాపిడి అవసరమవుతుంది. ఇలా సహజ రతిలో జరగకపోవటం వల్ల వాళ్లు భావప్రాప్తి పొందలేరు. కొందరి విషయంలో సహజ రతికి మానసిక స్థితీ అడ్డంకి కావొచ్చు. ఇంకొందరిలో రెండు కారణాలూ ఉండొచ్చు. ఇక మీ విషయంలో చెప్పాలంటే ముఖ రతి సమయంలో మీ భాగస్వామి క్లిటోరిస్‌ ప్రాంతంలో తగినంత రాపిడి కలిగిస్తూ ఉండి ఉంచొచ్చు. అలాగే స్వయంతృప్తి పొందేటప్పుడు కూడా భావప్రాప్తి పొందే మెలకువల మీద మీకు పట్టు ఉంటుంది. కానీ సహజ రతిలో భాగస్వామికి మిమ్మల్ని క్లైమాక్స్‌కు తీసుకెళ్లగలిగే మెలకువలు తెలియకపోవటం వల్ల ఈ సమస్య తలెత్తుతోంది. సహజ రతిలో మీరు భావప్రాప్తి పొందాలంటే క్లిటోరిస్‌కు రాపిడి కలిగే భంగిమలను ప్రయత్నించాలి. అలాగే లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు, భాగస్వామి చేతి సహాయంతో క్లిటోరిస్‌కు రాపిడి కలిగేలా ప్రోత్సహించాలి. ఇలా చేయగలిగితే క్లైమాక్స్‌కు చేరుకోవటం తేలికవుతుంది. సహజ రతిలో భావప్రాప్తి పొందే మెలకువలు తెలుసుకోవటం కోసం అవసరమనుకుంటే అనుభవజ్ఞులైన సెక్సాలజిస్ట్‌ను సంప్రదించవచ్చు.
 
డా షర్మిలా మజుందార్‌,
చీఫ్‌ సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకోఅనలిస్ట్‌,
Email :mili77@gmail.com