అనాసక్తి దూరం చేసేదెలా?

09-10-2018:డాక్టర్‌! మాకు పెళ్లయి రెండేళ్లు. మొదట్లో ఉత్సాహంగా పాల్గొన్నా, కాలం గడిచేకొద్దీ దాంపత్య జీవితం నిస్సారంగా తయారవుతున్నట్టు అనిపిస్తోంది. మరీ ముఖ్యంగా నా భార్యలో అనాసక్తి స్పష్టంగా కనిపిస్తోంది. ఇలా కాకుండా ఇద్దరం మునుపటిలా దాంపత్య జీవితాన్ని ఆస్వాదించే చిట్కాలు చెప్పగలరా?
ఓ సోదరుడు, మచిలీపట్నం
 
మీలాంటి పరిస్థితి ప్రతి జంటకూ ఎదురయ్యేదే! అయితే దాంతప్య జీవితం ఎప్పటికీ నిత్యనూతనంగా ఉండాలంటే, కొన్ని కొత్త పద్ధతులు, అలవాట్లు అలవరుచుకోవాలి. ఆవిడ కోసం ఆకర్షణీయమైన లోదుస్తులు కొని బహూకరించండి. తనకిష్టమైన ప్రదేశానికి తీసుకువెళ్లి కనీసం రెండు రోజులపాటైనా ఏకాంతంగా గడపండి. ఒత్తిడులకు దూరంగా, స్వాంతనను అందించే వాతావరణంలో ఇద్దరూ సేద తీరండి. మీకంటూ నాణ్యమైన సమయాన్ని గడపడం అలవాటు చేసుకోంది. దాంపత్య జీవితం సరికొత్త ఆనందాన్ని అందించడంలో కామసూత్ర పుస్తకం చక్కగా ఉపయోగపడుతుంది. ప్రయోగాలు చేయాలనుకుంటే భార్య అంగీకారం తీసకోండి. ఆమెతో చర్చించండి. బిడియం వదిలి స్వేచ్ఛగా, చొరవగా మాట్లాడే దగ్గరతనం కల్పించండి. కేవలం లైంగికంగా దగ్గరవడం కాకుండా మానసికంగా దగ్గరయ్యేలా మసలుకోండి. ఆవిడ ఇష్టానిష్టాలు, అభిప్రాయాలు, అలవాట్లకు విలువివ్వండి. మనసు ఎరిగి మసలుకోండి. తప్పకుండా మీ దాంపత్య జీవితం తిరిగి గాడిన పడుతుంది.
 
డాక్టర్‌ షర్మిలా మజుందార్‌
సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకో అనలిస్ట్‌
email: mili77@gmail.com
(కన్సల్టేషన్‌ కోసం)