సొరకాయతో లైంగిక శక్తి

ఆంధ్రజ్యోతి, 26-04-2017: శరీరంలోని జీవక్రియలన్నీ సవ్యంగా పనిచేసినప్పుడే లైంగిక వ్యవస్థ బలంగా ఉంటుంది. సొరకాయలో జీవ కియ్రల్ని క్రమబద్ధం చేసే అంశాలు పుష్కలంగా ఉండడం వల్ల ఇది పురుషుల పాలిట వరమయ్యింది. దీనివల్ల వీర్యవృద్ధి, లైంగిక శక్తి పెరగడంతో పాటు మరోన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

వీర్యవృద్ధిని కలిగించడంలో సొరకాయ గింజల పాత్ర కీలకం. సొరకాయ ముదురు గింజలను వేయించి, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాలు జీలకర్ర కలిపి నూరి కొంచెం అన్నంతో కలిపి తీసుకుంటే.. లైంగిక శక్తి పెరుగుతుంది. దీని వల్ల శారీరక దారుఢ్యం కూడా వృద్ధి చెందుతుంది.
 
సొరకాయ శరీరంలోని వేడినీ, కఫాన్నీ తగ్గిస్తుంది. వాంతులు, విరేచనాలు, పేగుపూత వంటి సమస్యలు ఉన్నవారు సొరకాయను తరుచూ తింటే ఎంతో మేలు కలుగుతుంది.
 
హృదయ సంబంధ వ్యాధులను అరికట్టడంలో సొరకాయ కీలక పాత్ర పోషిస్తుంది. ఒకవేళ తరుచూ తింటే జలుబు చేస్తుందనుకుంటే... శొంఠిపొడిని గానీ, మిరియాల పొడిని గానీ కలిపి తీసుకుంటే మంచి గుణం కనిపిస్తుంది.