స్మార్ట్‌ఫోన్‌ ద్వారా వీర్య కణ పరీక్ష!

21-01-2017  లాస్‌ఏంజిలెస్‌, జనవరి 20: సంతాన సాఫల్యతకు కీలకమైన వీర్యకణ సంఖ్యను తెలుసుకునేందుకు ఆస్పత్రికి వెళ్లనవసరంలేదు. అతి సులువుగా ఆ సంఖ్యను తెలిపే స్మార్ట్‌ఫోన్‌ ఆధారిత కిట్‌ను లాస్‌ ఏంజిలెస్ లోని మెడికల్‌ ఎలక్ట్రానిక్‌ సిస్టమ్స్‌(ఎమ్‌ఈఎస్‌) తయారుచేసింది. ‘యో స్పెర్మ్‌ టెస్ట్‌’ ద్వారా వీర్య కణాల సంఖ్యను 97 శాతం కచ్చితంగా తెలుసుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది. మైక్రోస్కోప్‌ సాయంతో టెస్ట్‌ను చేయవచ్చు. వీర్యాన్ని ఒక చిన్న గాజు పలకపై ఉంచి, దానిని మైక్రోస్కోప్‌ లెన్స్‌కు జతచేయాలి. యాప్‌ సాయంతో కెమెరా వీర్య కణాల కదలికలను రికార్డు చేస్తుంది.